Begin typing your search above and press return to search.

నమ్మరు నిజం.. ఈ దున్నకు 30వేల సంతానం

బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో తాజాగా ఒక పశువుల ప్రదర్శన జరిగింది. దీనికి దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన అత్యంత మేలుజాతి దున్నల్ని తీసుకొస్తారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 5:33 AM GMT
నమ్మరు నిజం.. ఈ దున్నకు 30వేల సంతానం
X

బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో తాజాగా ఒక పశువుల ప్రదర్శన జరిగింది. దీనికి దేశ వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన అత్యంత మేలుజాతి దున్నల్ని తీసుకొస్తారు. అలా తెచ్చిన ప్రదర్శనలో ఆరేళ్ల వయసున్న గోలు2 ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది అలాంటి ఇలాంటి దున్నపోతు కాదు. దీని ఖరీదు ఏకంగా రూ.10కోట్లు. ఈ మేలుజాతి దున్న.. ముర్రా జాతికి చెందినదిగా చెబుతారు. వివిధ పోటీల్లో పాల్గొన్న ఈ దున్న ఇప్పటికే బోలెడన్ని పతకాల్ని సొంతం చేసుకుంది.

దాదాపు 1500 కేజీల బరువున్న ఈ దున్నకు మరో స్పెషాలిటీ ఉంది. ఈ దున్నకు ఇప్పటి వరకు 30వేల సంతానం ఉంది. దీని వీర్యాన్ని అంత డిమాండ్ ఉంది. దీంతో.. దీని వీర్యంతో ఇప్పటికి 30వేల పశువులు జన్మించాయి. హర్యానాలోని పానీపత్ ఈ దున్నపోతు సొంతూరుగా చెబుతారు. దీన్ని ప్రవీణ్ అనే సంరక్షకుడు కంటికి రెప్పలా చేసుకుంటాడు. అతగాడికి గతంలో గోలు అనే దున్నపోతు ఉండేది. అది మరణించిన తర్వాత దీన్ని తీసుకొచ్చి దీనికి గోలు2 అన్న పేరు పెట్టుకున్నాడు.

ఈ దున్నను అత్యంత అపురూపంగా చూసుకుంటాడు. దీనికి రోజుకు 35 కేజీల పచ్చి.. ఎండుగడ్డి మేస్తుంటుంది. అంతేకాదు.. డ్రైఫ్రూట్స్త్ తో పాటు 7-8 కేజీల వరకు బెల్లాన్ని ఇట్టే ఆరగిస్తుందట. అంతేకాదు.. నెయ్యి.. పాలను కూడా దీనికి ఇస్తారు. దీనికి తిండి పెట్టేందుకే నెలకు రూ.30వేలు ఖర్చు చేస్తానని సంరక్షకుడు చెబుతున్నాడు. దీని వీర్యానికి ఉన్న డిమాండ్ తోపాటు.. పశువుల పోటీకి వెళితే పతకం తీసుకొని రావటం ఖాయమంటున్నారు.