Begin typing your search above and press return to search.

ఢిల్లీకి ఏటీఎం గా తెలంగాణ... షా సంచలన వ్యాఖ్యలు!

అవును... లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   25 April 2024 4:30 PM GMT
ఢిల్లీకి ఏటీఎం గా తెలంగాణ... షా సంచలన వ్యాఖ్యలు!
X

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. తెలంగాణలో త్రిముఖ పోటీ నెలకొన్న వేళ... బీజేపీ – బీఆరెస్స్ లపై కాంగ్రెస్, కాంగ్రెస్ - బీఆరెస్స్ లపై బీజేపీ, బీజేపీ – కాంగ్రెస్ లను ఒక గాటిన కట్టి బీఆరెస్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఈ సమయంలో తెలంగాణలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీజేపీ కీలక నేత అమిత్ షా.. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆరెస్స్, ఎంఐఎం లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... లోక్ సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల ప్రచారాలు హోరెత్తిపోతున్నాయి. ఈ సమయంలో త్రిముఖ పోటీ నెలకొన్న తెలంగాణలోనూ హోరెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావుకు మద్దతుగా బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా... సిద్దిపేటలో ఏర్పాటు చేసిన "బీజేపీ విశాల జనసభ" లో ప్రసంగించారు.

ఇందులో భాగంగా... ఇందులో భాగంగా తెలంగాణలో కనీసం 12 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. ఇదే సమయంలో... దేశవ్యాప్తంగా 400 కు పైగా స్థానాల్లో బీజేపీని గెలిపించాలన్నారు. ఇదే క్రమంలో... తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహిస్తామని అమిత్‌ షా అన్నారు.

మజ్లిస్‌ కు భయపడటం వల్లే బీఆరెస్స్, కాంగ్రెస్‌ లు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని తెలిపారు. అనంతరం అయోధ్య టాపిక్ ఎత్తిన అమిత్ షా... అక్కడ రామ మందిరం నిర్మాణానికి మోడీ కృషి చేశారని.. కశ్మీర్‌ ను భారత్‌ లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు!

ఈ సమయంలోనే... ఈ పదేళ్ల కాలంలో దేశంలో ఎన్నో సమస్యలు పరిష్కరించినట్లు చెప్పిన అమిత్ షా... జమ్ము కశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370ను తొలగించామని అన్నారు. ప్రధానంగా.. తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారని విమర్శించిన ఆయన... మరోసారి మోడీ ప్రధాని అయితే.. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తారని తెలిపారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు!