Begin typing your search above and press return to search.

చికెన్ ను ఎలా తీసుకుంటే మంచిది?

మన శరీరంలో మంచి కొవ్వు, చెడు కొవ్వు రెండు ఉంటాయి..

By:  Tupaki Desk   |   27 April 2024 12:30 AM GMT
చికెన్ ను ఎలా తీసుకుంటే మంచిది?
X

ప్రపంచంలో ఎక్కువ మంది తినే మాంసాహారాల్లో చికెన్ ప్రముఖ స్థానంలో నిలుస్తుంది. నెల రోజుల పాటు చికెన్ తినడం మానేస్తే కలిగే ప్రభావాలు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. వయసు, ఆరోగ్య స్థితి, పోషకాల కోసం చికెన్ తినాల్సిందే. కానీ తరచుగా తినడం వల్ల అనర్థాలు పెరుగుతాయి. చికెన్ తినడం ఆరోగ్యం కోసం మంచిదే. దీంతో ప్రొటీన్, ఇనుము, విటమిన్ బి12 ఉన్నవారు ఒక నెల పాటు చికెన్ తినడం మానేస్తే ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.

మన శరీరంలో మంచి కొవ్వు, చెడు కొవ్వు రెండు ఉంటాయి. మంచి కొవ్వు మనకు అవసరం. చెడు కొవ్వు అవసరం ఉండదు. మంచి కొవ్వు అధిక మోతాదులో తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం రాకుండా ఉంటుంది. ఒక నెల పాటు చికెన్ తినడం మానేస్తే చెడు కొవ్వులు తగ్గి మంచి కొవ్వు శాతం పెరిగితే మంచి ఫలితాలు వస్తాయి.

బరువు తగ్గడానికి చికెన్ సాయపడుతుంది. నెల పాటు చికెన్ తినడం మానేస్తే బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. జీర్ణక్రియ బాగుంటుంది. అజీర్తి సమస్యలు ఉన్న వారు జీర్ణక్రియ మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సోడియం అధికంగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుంది. నెలపాటు చికెన్ మానేస్తే రక్తపోటు ఉన్న వ్యక్తులకు బీపీ తగ్గించడంలో తోడ్పడుతుంది.

చికెన్ తినడం పూర్తిగా మానేస్తే ప్రొటీన్ లోపం వచ్చే సూచనలుంటాయి. కండరాల వ్యవస్థకు చికెన్ అవసరం. చికెన్ తినడం మానేస్తే ప్రొటీన్ లోపానికి దారి తీయవచ్చు. మాంసాహారం తినలేని వ్యక్తులు ఇనుము లోపం, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి చికెన్ తినడం మానేయడం వల్ల ఇనుము లోపం ఏర్పడవచ్చు. విటమిన్ బి12 లోపం చికెన్ విటమిన్ కు మూలం. నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం.

ఇలా చికెన్ ఆరోగ్యానికి మంచిది. ప్రొటీన్, ఇనుము లోపం ఉన్నవారు చికెన్ తీసుకోవాలి. కానీ అత్యధిక మోతాదులో తినకూడదు. మితంగా తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మాంసం ప్రియులు మటన్ కన్నా చికెన్ తినడమే మేలను తెలుసుకోవాలి. చికెన్ మన ఆరోగ్యానికి మంచిదనే విషయం గ్రహించుకోవడం మంచిది.