Begin typing your search above and press return to search.

జెట్ స్పీడ్ లో ఇంపాక్ట్ చూపించిన యువ దర్శకులు

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై జెట్ స్పీడ్ లో క్లిక్కయిన దర్శకుల లిస్ట్ చాలా తక్కువే.

By:  Tupaki Desk   |   25 April 2024 4:27 AM GMT
జెట్ స్పీడ్ లో ఇంపాక్ట్ చూపించిన యువ దర్శకులు
X

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై జెట్ స్పీడ్ లో క్లిక్కయిన దర్శకుల లిస్ట్ చాలా తక్కువే. ఇటీవల కాలంలో అయితే కొంతమంది నేషనల్ వైడ్ గా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వచ్చిన కొత్త తరం వారు పాన్ ఇండియా లెవెల్ లో తమకంటూ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. వారిలో ముగ్గురు దర్శకుల పేర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక అందులో మొదటిగా వినిపించే పేరు సందీప్ రెడ్డి వంగా. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా గురించి ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇప్పటికే యానిమల్ సినిమా పలు విభాగాలలో నేషనల్ అవార్డ్స్ సైతం సొంతం చేసుకుంది. అయితే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ క్యారెక్టరైజేషన్ విషయంలో చాలామంది విమర్శలు చేస్తున్నారు. దీంతో సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు నేషనల్ వైడ్ గా వినిపిస్తోంది.

ఆయన నెక్స్ట్ చేయబోయే స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో యానిమల్ పార్క్ మూవీ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. సందీప్ తర్వాత ఆ రేంజ్ లో ప్రస్తుతం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై వినిపిస్తున్న పేరు లోకేష్ కనగరాజ్. నగరం అనే సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన లోకేష్ కార్తీతో చేసిన ఖైదీ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు.

మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుని టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది. దీని తర్వాత విజయ్ తో చేసిన మాస్టర్, కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాలు లోకేష్ కనగరాజ్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి అందులో మాఫియా కథలతో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నాడు.

గత ఏడాది దళపతి విజయ్ తో చేసిన లియో యావరేజ్ టాక్ తెచ్చుకున్న భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాన్ ఇండియా రేంజ్ లో కూలి అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో లోకేష్ 1000 కోట్ల కలెక్షన్ టార్గెట్ అందుకుంటాడని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ ఇంపాక్ట్ డైరెక్టర్ గా అట్లీ కనిపిస్తున్నాడు. రాజా రాణి సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అట్లీ గత ఏడాది షారుక్ ఖాన్ తో హిందీలో జవాన్ మూవీ చేశారు.

ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. జవాన్ సినిమాతో దర్శకుడుగా అట్లీ బ్రాండ్ వేల్యూ అమాంతం పెరిగిపోయింది. నెక్స్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా బియాండ్ ది బాక్స్ ఉంటుందనే ప్రచారం నడుస్తోంది. ఈ ముగ్గురు దర్శకులు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రాబోయే రోజుల్లో రూల్ చేస్తారనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. చూడాలి మరి వీరు ఇంకా ఏ రేంజ్ ల్ సక్సెస్ చూస్తారో.