Begin typing your search above and press return to search.

60 రూల చీర ఆమెకో జ్ఞాప‌కం!

మొట్ట మొద‌టి సినిమాతోనే మార్కెట్ లో భాను ప్రియ ఓ బ్రాండ్ గా మారిపోయారు.

By:  Tupaki Desk   |   26 April 2024 11:30 PM GMT
60 రూల చీర ఆమెకో జ్ఞాప‌కం!
X

వెట‌ర‌న్ న‌టి భాను ప్రియ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో చిత్రాల్లో న‌టించిన అంద‌మైన హీరోయిన్. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇక తెలుగులో ఆమె `సితార` అనే సినిమాతో లాంచ్ అయ్యారు. వంశీ తెర‌కెక్కించిన ఆ సినిమా అప్ప‌ట్లో ఓ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచారు. భాను ప్రియ స్పూర్తితో కాళ్ల‌కు గ‌జ్జెలు క‌ట్టిన వారెంతో మంది. మొట్ట మొద‌టి సినిమాతోనే మార్కెట్ లో భాను ప్రియ ఓ బ్రాండ్ గా మారిపోయారు.

ఆ త‌ర్వాత కొన్నాళ్ల పాటు వెన‌క్కి తిరిగి చూడ‌కుండా కెరీర్ సాగిపోయింది. ఇప్ప‌టికీ యాక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా సితార సినిమా గురించి..అందులో చీర గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని వంశీ పంచుకున్నారు. అదేంటో ఆయ‌న మాటల్లోనే..`సితార` సినిమా హిట్ అవ్వ‌డంతో నా ఆనందానికి అవ‌దుల్లేవ్. ఒక రోజున నేను ఏడిద నాగేశ్వరరావుగారి ఇంట్లో ఉండగా భానుప్రియగారు కాల్ చేశారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను లిఫ్ట్ చేశాను. `సితార` సినిమాలో తాను కట్టుకున్న ఒక చీరను భానుప్రియ గుర్తుచేశారు.

ఆ చీర కావాలని అడిగారు. అది చాలా సాధారణమైన వాయిల్ చీర అని చెప్పాను. దాని ఖ‌రీదు 60 రూపాయలు మాత్రమే. అదెంత మీకు అన్నాను. అప్పుడే మ‌రోసారి సుమన్ - భానుప్రియ ఇద్దరూ పోలవరం గోదావరి తీరంలో నడుస్తూ వెళుతున్నప్పటి షాట్ ను .. ఆ షాట్ లో ఆ చీర తడిసిపోవడం గురించి గుర్తుచేశారు. భానుప్రియ ఆ చీర అడిగినట్టుగా నాగేశ్వరరావుగారు దంపతులకు చెప్పాను. ఆ చీరను ఆమెకి పంపిద్దామని నాగేశ్వరరావుగారి భార్య కూడా అన్నారు. ఆ తరువాత `సితార` సినిమాను రష్యాలోకి అనువదించారు. ఆ విషయం తెలిసి ఇళయరాజాగారు చాలా సంతోషించారు` అని అన్నారు.

`సితార` చిత్రాన్ని ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. మ్యూజిక‌ల్ గా ఈ సినిమా గ్రాండ్ స‌క్సెస్ అయింది. 1984లో విడుదలైన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఇటీవ‌లే భాను ప్రియ త‌మిళ్ లో న‌టించిన `ఆయ‌లాన్`రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.