Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో 100 డేస్ టార్గెట్!

రెండు మూడు సంవ‌త్స‌రాలు పాటు షూటింగ్ చేసేది కేవ‌లం రాజ‌మౌళి..సుకుమార్..ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులే

By:  Tupaki Desk   |   29 March 2024 7:45 AM GMT
టాలీవుడ్ లో 100 డేస్ టార్గెట్!
X

రెండు మూడు సంవ‌త్స‌రాలు పాటు షూటింగ్ చేసేది కేవ‌లం రాజ‌మౌళి..సుకుమార్..ప్ర‌శాంత్ నీల్ లాంటి ద‌ర్శ‌కులే. వాళ్ల క‌థ‌లు స్పాన్ ఎక్కువ కావ‌డంతో అన్నేళ్ల పాటు సెట్స్ లో ఉంటున్నారు. రెండు ..మూడు భాగాలు గా వాటిని రిలీజ్ చేసే ప్లాన్లో లో భాగంగా ఒక్కో భాగాన్నిచెక్క‌డం కోసం అంత స‌మ‌యం కేటాయి స్తుంటారు. పాన్ ఇండియాలో వాళ్ల సినిమాల‌కంటూ ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉన్న నేప‌థ్యంలో వాటిపై అంతగా ప‌ని చేస్తుంటారు.

వాళ్ల‌ని మిన‌హించి మిగ‌తా మేక‌ర్ల సంగ‌తి చూస్తే! చాలా మంది ద‌ర్శ‌కులు టాలీవుడ్ లో టార్గెట్ 100 డేస్ రూల్ ఫాలో అవుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. 'భీమ్లానాయ‌క్'..'బ్రో'..'వ‌కీల్ సాబ్' లాంటి చిత్రాలు 100 రోజుల్లోపే షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అంత‌కు ముందు 'వాల్తేరు వీర‌య్య‌'..'భోళాశంక‌ర్'..'గాడ్ ఫాద‌ర్' లాంటి సినిమాలు కూడా ఇదే నిబంధ‌న అనుస‌రించాయి. వీలైనంత వేగ‌గా సినిమా షూటింగ్ చుట్టేయ‌డానికి అవ‌కాశం ఉండ‌టంతో ఆయా మేక‌ర్స్ ఆ ఛాన్స్ తీసుకున్నారు.

తాజాగా ఇదే రూల్ని మ‌రికొన్ని చిత్రాలు ఫాలో అవుతున్నాయి. ర‌వితేజ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 75 రోజుల్లోనే పూర్తి చేయాల‌న్న‌ది ప్లాన్. దాని ప్ర‌కార‌మే ముందుకెళ్తున్నారు. ఎన్నిక‌లు త‌ర్వాత ప‌వన్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' లో జాయిన్ అవుతాడు కాబ‌ట్టి ఈ గ్యాప్లోనే బ‌చ్చ‌న్ ని పూర్తిచేయాలి. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వ‌షిష్ట ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న 'విశ్వంభ‌ర' కూడా 100 రోజులు టార్గెట్ గానే సెట్స్ కి వెళ్లింది. దానికి త‌గ్గ‌ట్టే షూటింగ్ నిర్వ‌హిస్తున్నారు.

సోషియా ఫాంట‌సీ చిత్రం కావ‌డంతో గ్రాఫిక్స్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. అందుకే షూట్ని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చిరు అదేశాలిచ్చారు. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ప‌రుశురాం కాంబోలో తెర‌కెక్కిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 100 రోజుల్లోనే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. సంక్రాతి రిలీజ్ అయిన నాగార్జున 'నాసామి రంగ 'అయితే ఏకంగా 50 రోజుల్లోనే షూట్ పూర్తిచేసి..అతి త‌క్కువ స‌మ‌యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కూడా పూర్తిచేసి రిలీజ్ చేసారు.

ఇలా చేయ‌డం వ‌ల్ల‌నిర్మాత‌ల‌కు నిర్మాణ భారం చాలా వ‌ర‌కూ త‌గ్గుతుంది. ఈ విష‌యంలో పూరిజ‌గ‌న్నాధ్ మ‌రింత స్ట్రాట‌జీతో వ్య‌వ‌రిస్తుంటారు. ఆయ‌న ఏసినిమా అయినా 50 రోజుల్లోనూ షూట్ పూర్తిచేసేవారు. కానీ ఇప్పుడా స్పీడ్ కావాల‌నే త‌గ్గించారు. ఈ విష‌యంలో పూరికి రాజ‌మౌళి పెద్ద అభిమాని అన్న సంగ‌తి తెలిసిందే.