Begin typing your search above and press return to search.

బాలయ్య మీదే ఆ హీరోయిన్ ఆశలు..!

ప్రస్తుతం బాలకృష్ణ 109వ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   17 April 2024 12:30 PM GMT
బాలయ్య మీదే ఆ హీరోయిన్ ఆశలు..!
X

బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి చేసిన లాస్ట్ మూవీ అఖండ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో ఆ కాంబో మీద ఉన్న క్రేజ్ డబుల్ అయ్యింది. సినిమాల్లో సెంచరీ కొట్టాక బాలయ్య దూకుడు మరింత పెరిగింది. వరుస సినిమాలు చేస్తూ వాటితో సూపర్ హిట్లు కొడుతూ నందమూరి ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ని కూడా అలరిస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ 109వ సినిమా కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమా కుదిరితే దసరా లేదంటే దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


109వ సినిమా తర్వాత 110వ సినిమా అఖండ 2 ని ఫిక్స్ చేసుకుంటున్నాడు బాలకృష్ణ. బోయపాటి శ్రీనుతో మరోసారి కలిసి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అఖండ 2 స్టోరీ రెడీ కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పొచ్చు. అయితే అఖండ 2 లో హీరోయిన్ గా మళ్లీ ప్రగ్యా జైశ్వాల్ కే ఛాన్స్ ఇస్తారా లేదా మరో కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

అఖండ హిట్ పడినా ప్రగ్యా జైశ్వాల్ కి మాత్రం కలిసి రాలేదు. సినిమా ఛాన్సుల కోసం అమ్మడు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. రకరకాల ఫోటో షూట్స్ తో దర్శక నిర్మాతలను బుట్ట లో పడేయాలని చూస్తున్న ప్రగ్యా జైశ్వాల్ ఎఫర్ట్స్ ని ఎవరు గుర్తించట్లేదు. ఎలాగు అఖండ లో నటించింది కాబట్టి అఖండ 2 కథ కొనసాగించే ఛాన్స్ ఉంటే ప్రగ్యా నే ఆప్షన్ అవుతుంది.

అమ్మడు కూడా బాలయ్య సినిమా మీదే చానా హోప్స్ పెట్టుకుంది. బాలకృష్ణ, బోయపాటి ఈ కాంబో అంటే సినిమా సూపర్ హిట్ కాబట్టి ప్రగ్యా కూడా తానొక హిట్ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉంది. అఖండ 2 లో ప్రగ్యా ఉంటే మాత్రం ఆమెకు లక్ ఫేవర్ చేసే ఛాన్స్ ఉంటుంది. సినిమాలు చేయకపోయినా తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం ఎడతెరపి లేకుండా రకరకాల ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది ప్రగ్యా. అఖండ 2 తర్వాత అయినా ఆమె దశ తిరుగుతుందేమో చూడాలి. అఖండ 2 సినిమాను కేవలం తెలుగు ఆడియన్స్ కోసమే అన్నట్టు కాకుండా సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు. అదే జరిగితే ఈసారి థమన్ కొట్టే మ్యూజిక్ కి నేషనల్ లెవెల్ లో రీ సౌండ్ వస్తుందని చెప్పొచ్చు.