Begin typing your search above and press return to search.

ఆర్కే సాగర్ 'ది 100'.. టీజర్ ఎలా ఉందంటే..

తెలుగు సీరియల్ మొగలిరేకులుతో నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ఎలాంటి ఫేమ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 6:25 AM GMT
ఆర్కే సాగర్ ది 100.. టీజర్ ఎలా ఉందంటే..
X

తెలుగు సీరియల్ మొగలిరేకులుతో నటుడు ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ఎలాంటి ఫేమ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. సీరియల్ ఇచ్చిన క్రేజ్ తో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 2016లో సిద్ధార్థ మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత రెండేళ్లకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మూవీ చేశారు. అక్కడికి మూడేళ్ల తర్వాత తన మూడో సినిమా షాదీ ముబారక్ తో వచ్చి ప్రేక్షకులను అలరించారు.


ఇప్పుడు హీరోగా 'ది 100' అనే యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆర్కే సాగర్. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విడుదల చేసిన ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిరంజీవి తల్లి అంజనా దేవి లాంఛ్ చేశారు. ప్రస్తుతం జనసేన తరపున నుంచి ఏపీలో ప్రచారం చేస్తున్నారు ఆర్కే సాగర్. ఈ బంధంతోనే తన మూవీ టీజర్ ను అంజనాదేవి చేతుల మీదుగా లాంఛ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక టీజర్ విషయానికొస్తే.. ఐపీఎస్ అధికారి విక్రాంత్ చేసిన తప్పులపై మానవ హక్కుల కమిషన్ విచారించడంతో ప్రారంభమవుతుంది. కొన్ని సామూహిక హత్యలు నగర శివార్లలో జరుగుతాయి. బాధితులంతా రౌడీ షీటర్లే. ఈ విషయంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతుంటారు. నేరస్థులను ఎదుర్కోవడంలో తనదైన శైలి కలిగి ఉన్న హీరో తన గురించి మీడియా లేదా ఇతరులు ఏమనుకుంటున్నా పట్టించుకోరు. ఉన్నతాధికారులతోపాటు మానవ హక్కుల కమిషన్‌ కు కూడా భయపడరు.

తాను డ్యూటీ చేస్తున్న ఏరియాలో నేరాలను నిర్మూలించడానికి ఎంతకైనా తెగించే నిజాయితీ గల ఐపీఎస్ అధికారి పనితనాన్ని ప్రదర్శించేలా టీజర్ ఉంది. ఆర్కే సాగర్ ఖాకీ దుస్తుల్లో అదిరిపోయేలా కనిపించారు. ఆయన యాక్టింగ్ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది. హీరో క్యారెక్టర్‌ ను డైరెక్టర్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. డైలాగులు కూడా అదిరిపోయాయి. సినిమాలో మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ ఓవరాల్ గా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది.

పలు సినిమాలతో అవార్డులు గెలుచుకున్న రాఘవ్ ఓంకార్ శశిధర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యా ఫిల్మ్ కార్ప్, దమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె తారక్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణ, గిరిధర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.