Begin typing your search above and press return to search.

లోకేష్ × తలైవా 171 టీజర్.. మళ్ళీ పాత టైటిల్ తోనే ర్యాంపేజ్

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   22 April 2024 4:51 PM GMT
లోకేష్ × తలైవా 171 టీజర్.. మళ్ళీ పాత టైటిల్ తోనే ర్యాంపేజ్
X

సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తన 171వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఫ్యాన్స్ లో అయితే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఖైదీ విక్రమ్ సినిమాలతో పాటు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా దర్శకుడు మంచి క్రేజ్ అందుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా తెలుగులో కూడా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

దీంతో ఇప్పుడు అతని నుంచి రాబోయే తలైవా 170వ సినిమాపై కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ ను విడుదల చేశారు. చాలా రోజులుగా సినిమాకు సంబంధించిన టైటిల్ పై పలు రకాల గాసిప్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి లోకేష్ తన పాత ఫార్మాట్లోనే టైటిల్ సెట్ చేయడం విశేషం.

ఇక ఖైదీ విక్రమ్ లాంటి టైటిల్స్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన లోకేష్ ఈసారి కూలి అంటూ రజనీకాంత్ 171 వ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రజనీకాంత్ మునుపెన్నడూ లేని లుక్కుతో కనిపించబోతున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చేశారు. టీజర్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ పై సూపర్ స్టార్ దాడి చేయడం అలాగే వింటేజ్ డైలాగ్స్ తో ఆకట్టుకోవడం ఫాన్స్ కు మంచి కిక్ అయితే ఇచ్చింది.

దానికి తోడు అనిరుద్ మ్యూజిక్ కూడా మరోసారి గట్టిగానే క్లిక్ అయింది. మొత్తానికి టీజర్ తోనే మరోసారి దర్శకుడు లోకేష్ సినిమాకు మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేశాడు. తప్పకుండా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సాలిడ్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షెడ్స్ లో ఉంటుంది అని కూడా ఇదివరకే లోకేష్ వివరణ ఇచ్చాడు.

ఇక ఇప్పటివరకు ఎక్కువగా తన మల్టీవర్స్ కథలతో వచ్చిన లోకేష్ ఈసారి మాత్రం అలా కాకుండా రజినీకాంత్ తో స్ట్రైట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇందులో ఎలాంటి డ్రగ్స్ ఆన వాళ్లు కూడా ఉండవని తెలుస్తోంది. ఎక్కువగా గోల్డ్ కు సంబంధించిన స్మగ్లింగ్ నేపథ్యంలో కథను రాసుకున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాతో సూపర్ స్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.