Begin typing your search above and press return to search.

ఫ్లాప్ లో ఉన్నా పాన్ ఇండియా హీరో దొరికేశాడు!

డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర సహాయక దర్శకురాలిగా పనిచేసిన నందిని రెడ్డి మొదట నానితో అలా మొదలైంది అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 April 2024 10:30 AM GMT
ఫ్లాప్ లో ఉన్నా పాన్ ఇండియా హీరో దొరికేశాడు!
X

డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర సహాయక దర్శకురాలిగా పనిచేసిన నందిని రెడ్డి మొదట నానితో అలా మొదలైంది అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. మొదటి అడుగులోనే మంచి సక్సెస్ అందుకున్న ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. ఇక ఆ తర్వాత వెంటనే మంచి స్టార్ ఇమేజ్ తో ఉన్న సమంత సిద్ధార్థ్ తో జబర్దస్త్ సినిమా చేసింది. కానీ ఆ సినిమాపై కాపీ కంటెంట్ ఆరోపణలు వచ్చాయి.

అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అనంతరం మళ్లీ కల్యాణ వైభోగమే అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసింది అది కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఇక మళ్ళీ సమంత ఓ బేబీ అనే సినిమా చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ కొట్టింది. అనంతరం మరి కొంత గ్యాప్ తీసుకున్న నందిని అన్ని మంచి శకునములే అనే సినిమా చేసింది.

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ ఏమీ కాలేదు. ఇక ఆమెకు ఆఫర్లు రావడం కష్టమే అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లుగా తెలుస్తోంది. ఏకంగా పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న యువ హీరోతోనే సినిమా చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఆ హీరో మరెవరో కాదు.. హనుమాన్ సినిమాతో ఇటీవల మంచి సక్సెస్ అందుకున్న తేజ సజ్జా అని తెలుస్తోంది. తేజ సజ్జ ఇదివరకే నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. అది అతనికి మంచి గుర్తింపును తీసుకువచ్చింది. బహుశా ఆ కృతజ్ఞత వల్లనో ఏమో కానీ మొత్తానికి ఈ దర్శకురాలికి మాత్రం అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తేజ లైనప్ కూడా గట్టిగానే ఉంది.

హనుమాన్ సక్సెస్ అందుకున్న తర్వాత అతనికి బడా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే ఒక డిఫరెంట్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు నందిని రెడ్డితో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కాంబినేషన్లో వచ్చే చిత్రాన్ని కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ నుంచి అఫీషియల్ గా అప్డేట్ రాబోతోంది. మరి ఈ సినిమాతో నందిని రెడ్డి ఎలాంటి గుర్తింపును అందుకుంటుందో చూడాలి.