Begin typing your search above and press return to search.

మిరాయ్ గ్లింప్స్.. ఆ గ్రంథం కోసం తేజ పోరాటం

ఈ మూవీ టైటిల్ ను గ్లింప్స్ తో అనౌన్స్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. నేడు చెప్పినట్లే రివీల్ చేశారు

By:  Tupaki Desk   |   18 April 2024 8:19 AM GMT
మిరాయ్ గ్లింప్స్.. ఆ గ్రంథం కోసం తేజ పోరాటం
X

సంక్రాంతికి హనుమాన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా.. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేనితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సూర్య వర్సెస్ సూర్య, ఈగల్ వంటి డిఫరెంట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు మరో సరికొత్త కథతో రానున్నారు. ఇటీవల ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి.. ఒక యోధుడి గొప్ప సాహసం అంటూ మంచి బజ్ క్రియేట్ చేశారు.

ఈ మూవీ టైటిల్ ను గ్లింప్స్ తో అనౌన్స్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. నేడు చెప్పినట్లే రివీల్ చేశారు. పాన్ ఇండియా లెవెల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ సూపర్‌ యోధుడిగా కనిపించ‌నున్నారు. ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్న టైటిల్ మిరాయ్ నే ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 18వ తేదీన ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. 2డీ అండ్ 3డీలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీ టైటిల్ మిరాయ్ అంటే ఫ్యూచ‌ర్ అని అర్థం.

మౌర్య సామ్రాజ్యానికి రాజు అయిన అశోకుడు కళింగ యుద్ధం తర్వాత పశ్చాతాపంతో యోగిగా మారుతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఒక అపార గ్రంథం ఆప‌ద‌లో ఉంటుంది. ఇక ఆ గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం దుండగులు చాలా ప్రయత్నిస్తుంటారు. దాన్ని కాపాడేందుకు యోధుడు తేజ సజ్జా రంగంలోకి దిగుతాడు. ఆ అపార గ్రంథం కోసం జరిగే పోరాటమే ఈ సినిమా కథగా గ్లింప్స్ ద్వారా అర్ధమవుతోంది.

అయితే గ్లింప్స్ లో తేజ సజ్జా స్టైలిష్ మేక్ ఓవర్ తో అద్భుతంగా కనిపిస్తున్నారు. మరో సక్సెస్ ను తేజ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. కర్రసాముతో పాటు ఇతర విద్యల్లో తేజ ట్రైనింగ్ తీసుకున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. తేజకు ఆ రోల్ పర్ఫెక్ట్ గా సూట్ అయిందని చెబుతున్నారు.

గ్లింప్స్ లో కార్తీక్ ఘట్టమనేని హార్డ్ వర్క్ బాగానే కనిపిస్తుందని అంటున్నారు. గౌర హరి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని, వీఎఫ్‌ ఎక్స్ వర్క్ క్వాలిటీగా ఉందని చెబుతున్నారు. రితికా నాయక్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా.. భారతీయ భాషలతో పాటు ఇతర దేశాల్లో కూడా విడుదల అవ్వనుంది. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.