Begin typing your search above and press return to search.

సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్

తెలుగు సినిమాల్లో తల్లిగా, ఆంటీగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా సురేఖా వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2024 10:37 AM GMT
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్
X

తెలుగు సినిమాల్లో తల్లిగా, ఆంటీగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా సురేఖా వాణి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. సహాయ నటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నటిస్తూనే ఉంది. మెయిన్ గా బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ పక్కన నటిస్తూ మరింత గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన అందాలతో ప్రేక్షకులను అలరిస్తుంటోంది సురేఖ.


ఇక ఆమె డాటర్ సుప్రీత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సురేఖ, సుప్రీతను పక్కపక్కన చూస్తే తల్లీకూతుళ్లు లాగా అస్సలు ఉండరు. అక్కాచెల్లెళ్ల లా కనిపిస్తారు. ఇక సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ కలిసి చేసే సందడి మాములుగా ఉండదు. ఎప్పటికప్పుడు వెకేషన్లకు వెళ్తుంటారు. డిన్నర్ పార్టీల్లో ఫుల్ చిల్ అవుతుంటారు. అక్కడ దిగిన గ్లామరస్ పిక్స్ ను తమ ఫాలోవర్స్ కోసం షేర్ చేసి సందడి చేస్తుంటారు. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు.


అయితే ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ట్రై చేస్తున్న సుప్రీత.. త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆమె డెబ్యూ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే హీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో డైలీ కొత్త పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగుడుతుంటోంది. ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటోంది సుప్రీత.


తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఫ్రెండ్స్ తో వెకేషన్ లో ఉన్న సుప్రీత.. మైండ్ బ్లాకింగ్ ఫోటోస్ షేర్ చేసింది. 'ప్రజలు వస్తుంటారు, పోతుంటారు.. అదే జీవితం' అనే క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఎద అందాలతో కవ్విస్తూ నెట్టింట హీట్ పుట్టించింది. తన పోజులతో ఒక్కసారిగా సెగలు రేపింది. నవ్వుతోనే మాయ చేసింది. ఓ ఫోటోలో ఓరగా చూస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది. తన గ్లామర్ తో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సుప్రీత పిక్స్ ను చూసి ఫ్లాట్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎద అందాలు చూసి అల్లాడిపోతున్నట్లు చెబుతున్నారు. పెర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. కలర్ ఫుల్ డ్రెస్ లో నవ్వుతో పడేస్తుందని అంటున్నారు. ఆమె గ్లామర్ కు ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి సుప్రీత ఫస్ట్ మూవీతో ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి.