Begin typing your search above and press return to search.

సుహాస్ సినిమాకు ఇది కిక్కిచ్చే డీల్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్న హీరోల్లో సుహాస్ ఒకరు.

By:  Tupaki Desk   |   25 April 2024 7:24 AM GMT
సుహాస్ సినిమాకు ఇది కిక్కిచ్చే డీల్
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్న హీరోల్లో సుహాస్ ఒకరు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న సుహాస్.. కలర్ ఫోటో మూవీతో హీరోగా పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత హీరోగానే కాకుండా కమెడియన్ గా, విలన్ గా ఏ పాత్ర అయినా అదరగొడుతున్నారు. రైటర్ పద్మభూషణ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో హ్యట్రిక్ హిట్లు కొట్టారు.

ఇటీవల శ్రీరంగనీతులు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుహాస్. మూడు కథల సమాహారంగా తెరకెక్కిన ఈ ఆంథాలజీ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇప్పుడు ప్రసన్న వదనం మూవీతో మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రానున్నారు సుహాస్. అర్జున్ వీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. వేసవి కానుకగా ఈ సినిమా మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ప్రసన్నవదనం సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులో కూడా మైత్రినే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు కర్ణాటక థియేట్రికల్ రైట్స్ ను హోంబలే ఫిల్మ్స్ దక్కించుకుంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ నిర్మించిన ఆ సంస్థ.. ప్రసన్నవదనం మూవీని రిలీజ్ చేయడం విశేషం.

ఇప్పటికే ప్రసన్న వదనం మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఎవరి ముఖాలు సరిగ్గా కనిపించని ఫేస్ బ్లైండ్ నెస్ అనే విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిగా కనిపించనున్నారు సుహాస్. అలాంటి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఆ సమస్య వల్ల హీరో ఎదుర్కొన్న ఇబ్బందులు చుట్టూ ఈ సినిమా అంతా తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

అరుణ్ వీకే దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుహాస్ సరసన పాయల్ రాధాకృష్ణ నటిస్తోంది. రాశీ సింగ్, నందు, వైవా హర్ష చెముడు, నితిన్ ప్రసన్న, సాయి శ్వేత, కుశాలిని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గేనిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.