Begin typing your search above and press return to search.

'గే' అని పిలిస్తే సిగ్గుప‌డ‌న‌న్న క‌మెడియ‌న్

సుచీలీక్స్ సుచిత్ర మ‌ళ్లీ హెడ్‌లైన్స్‌లోకొస్తోంది. దీనికి కార‌ణం ఒక యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూ

By:  Tupaki Desk   |   16 May 2024 12:40 PM GMT
గే అని పిలిస్తే సిగ్గుప‌డ‌న‌న్న క‌మెడియ‌న్
X

సుచీలీక్స్ సుచిత్ర మ‌ళ్లీ హెడ్‌లైన్స్‌లోకొస్తోంది. దీనికి కార‌ణం ఒక యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూ. ఈ ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి సుచీ లీక్స్ ని త‌ల‌పించేలా ర‌క‌ర‌కాల కామెంట్ల‌తో పాత విష‌యాల‌ను కొత్త‌గా ప్ర‌స్థావించింది సుచీ. ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ హీరో 'గే' అని, అలాగే స్వ‌లింగ సంప‌ర్కుడైన‌ త‌న భ‌ర్త‌తో అత‌డు శృంగారంలో పాల్గొన్నాడ‌ని కూడా ఆరోపించింది. ఈ ఎపిసోడ్ పై సుచిత్ర మాజీ భ‌ర్త‌, స్టాండ్-అప్ కమెడియన్ కార్తీక్ కుమార్ స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఆమె వాదనలపై స్పందించారు.

ఈ వీడియోలో సుచిత్ర గురించి ప‌ట్టించుకోనని కార్తీక్ అన్నాడు. ఒక‌వేళ‌ తాను స్వలింగ సంపర్కుడినైతే సిగ్గుపడనని చెప్పాడు. ఆ క‌మ్యూనిటీలో ఉన్న లైంగికతతో స‌మ‌స్య లేదు. అద్భుతమైన స్పెక్ట్రమ్‌లో నేను ఎలాంటి లైంగిక సంబంధం కలిగి ఉంటానో దానికి చాలా గర్వంగా ఉంటుంది. నేను సిగ్గుపడను. నేను గర్విస్తాను. నేను నా నగరంలో గ‌ర్వంగా ర్యాలీలో చేరతాను.. అన్ని రకాల లైంగికతలకు సంబంధించిన ప్రైడ్ ర్యాలీలో చేరి, మీ మద్దతును తెలియజేయండి. ఇక సిగ్గు లేదు. అహంకారం మాత్రమే ఉంది... గర్విస్తున్నాను'' అని రాసారు. త‌న‌కు ప్రేమ, మద్దతు మాత్రమే కావాలంటూ ల‌వ్ ఈమోజీని షేర్ చేసాడు. అత‌డి ప‌రిణ‌తిని చూశాక‌ అభిమానులు అందరూ ప్ర‌శంసించారు. LGBTQA+ కమ్యూనిటీకి అతడు మద్దతు ప‌ల‌క‌డాన్ని ప్రశంసించారు.

కార్తీక్ కుమార్ -సుచిత్ర 2005లో వివాహం చేసుకున్నారు. కానీ విభేధాల‌తో 2017లో విడిపోయారు. తరువాత అతడు 2021లో అమృత శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నాడు. అంతకుముందు ఒక తమిళ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుచిత్ర కార్తీక్‌ను 'అద్భుతమైన వ్యక్తి' అని ప్ర‌శంసించారు. కార్తీక్‌ శ్రీరాముడి వంటి వాడు అని కూడా కితాబిచ్చారు. అయితే విడాకుల అనంత‌రం త‌న విచారాన్ని ఇలా చెప్పుకుంది. ''మనం విడాకులు తీసుకుంటున్నామని నాకు తెలుసు. ఆందోళన చెందుతున్న మనందరికీ ఇది చాలా బాధాకరమైనది.. కానీ కొన్ని పరిష్కరించలేని సమస్యల కారణంగానే ఇలా జ‌రుగుతోంది''అన్నారు.

'కుముదం' అనే తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ హీరో విడాకుల గురించి సుచిత్ర కొన్ని షాకింగ్ వాదనలు చేసింది. అదే ఇంటర్వ్యూలో తన మాజీ భర్త స్వలింగ సంపర్కుడని పేర్కొంది. స‌ద‌రు స్టార్ హీరోతో స్వలింగ సంపర్క కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపించింది. కార్తీక్‌ను పెళ్లి చేసుకుని రెండో భార్య‌ అమృత తప్పు చేసిందని కూడా కామెంట్ చేసింది. నిజానికి సుచిత్ర 'సుచి లీక్స్' పెద్ద సంచ‌ల‌నం. సుచీ చివరిసారిగా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 4లో కనిపించింది. మరోవైపు కార్తీక్ కుమార్ రీసెంట్ గా స్టాండ్ అప్ స్పెషల్ ''ఆన్స్‌ప్లెయినింగ్'' ప్రదర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నారు.