Begin typing your search above and press return to search.

SSMB 29: జపాన్ లో ఓ అప్డేట్ ఇచ్చిన జక్కన్న

తాజాగా జపాన్ లో RRR సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న కూడా వెళ్లారు

By:  Tupaki Desk   |   19 March 2024 3:58 AM GMT
SSMB 29: జపాన్ లో ఓ అప్డేట్ ఇచ్చిన జక్కన్న
X

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా జపాన్ లాంటి దేశాలలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఒకప్పుడు రజినీకాంత్ ని జపాన్ ఆడియన్స్ ఎక్కువగా అభిమానించేవారు. ఇప్పుడు జక్కన్న సినిమాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి నుంచి రాబోయే సినిమాలకి సంబందించిన అప్డేట్స్ తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు.

తాజాగా జపాన్ లో RRR సినిమా స్పెషల్ షోలు ప్రదర్శించారు. అక్కడ థియేటర్స్ కు జక్కన్న కూడా వెళ్లారు. ఇక ఆయన వస్తున్నారని తెలుసుకున్న జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. రాజమౌళితో ప్రత్యేకంగా ఫొటోలు దిగడమే కాకుండా ప్రత్యేకంగా వారికి కొన్ని గిఫ్టులు కూడా ఇచ్చారు. ఇక రాజమౌళి తో పాటు ఆయన సతీమణి రామా రాజమౌళి కూడా అక్కడికి వెళ్లారు.

ఇక రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే SSMB 29 సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ కూడా అక్కడే ఇచ్చారు. నెక్స్ట్ చేయబోయే సినిమా సినిమా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యానని తెలిపాడు. అలాగే ఈ సినిమాకి సంబందించి ఇప్పటి వరకు హీరో మాత్రమే ఫైనల్ అయ్యాడని తెలిపారు.

అలాగే ఈ సినిమాలో మహేష్ బాబుని హీరోగా చేస్తున్నాడని, అతను చాలా అందంగా ఉంటాడని, మూవీ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరికి పరిచయం చేస్తానని రాజమౌళి జపాన్ అభిమానులకి చెప్పడం విశేషం. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేస్తామని కూడా అన్నారు. ఇక రాజమౌళి ఇచ్చిన అప్డేట్ జపాన్ ఆడియెన్స్ ను కూడా ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.

SSMB 29 సినిమాలో ఇండోనేషియా బ్యూటీని హీరోయిన్ గా ఖరారు చేశారని జరిగినట్లు ఇదివరకే చాలా రకాల వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో రాజమౌళి నుంచి సరైన క్లారిటీ అయితే రాలేదు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయంటే క్యాస్టింగ్ సెలక్షన్ కూడా మొదలుపెట్టి ఉంటారనే మాట వినిపిస్తోంది. అలాగే త్వరలో సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్సమెంట్ తో పాటు షూటింగ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గతంలో హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో జక్కన్న ఒప్పందం చేసుకోవడంతో సూపర్ స్టార్ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటిస్తారని టాక్ వచ్చింది.

ఈ మూవీ అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని, వరల్డ్ అడ్వాంచర్ ట్రావెలర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో కనిపిస్తాడని ఇప్పటికే రైటర్ విజయేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం ఈ మూవీలో క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మహేష్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జక్కన్న దీనిపై ఎప్పుడు అప్డేట్ ఇస్తాడనేది చూడాలి.