Begin typing your search above and press return to search.

SSMB29: ఏదైనా హింట్ ఇస్తారా బాబు?

ఒక స్పెషల్ షార్ట్ వీడియో రిలీజ్ చేసి మూవీకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నారంట. అంటే కాన్సెప్ట్ పై హింట్ ఇచ్చేలా ఆ వీడియో ఉంటుందని టాక్.

By:  Tupaki Desk   |   18 April 2024 4:57 AM GMT
SSMB29: ఏదైనా హింట్ ఇస్తారా బాబు?
X

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మూవీ చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలుస్తోంది. సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తాడని ఇప్పటికే జక్కన్న పలు సందర్భాలలో తెలియజేశారు.

పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం రాజమౌళి చేయబోతున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీని ఈ మూవీ షూటింగ్ కోసం ఉపయోగించబోతున్నారంట. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ ని సినిమాలో కీలక పాత్రల కోసం ఎంపిక చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని రీసెంట్ గా రాజమౌళి జపాన్ లో ఓ సమావేశంలో చెప్పారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా లండన్ లో గత కొద్ది రోజులుగా ఉంటున్నారు. SSMB29 సినిమాలోని క్యారెక్టర్ కోసం ప్రత్యేకంగా సిద్ధం అవుతున్నారు. లుక్ తో పాటు ఫిజిక్ కూడా చేంజ్ చేసే పనిలో మహేష్ బాబు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. త్వరలో ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక స్పెషల్ షార్ట్ వీడియో రిలీజ్ చేసి మూవీకి సంబందించిన ఎనౌన్స్ మెంట్ అప్డేట్ ఇవ్వబోతున్నారంట. అంటే కాన్సెప్ట్ పై హింట్ ఇచ్చేలా ఆ వీడియో ఉంటుందని టాక్.

ఈ ఏడాది ఆఖరిలో సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో ఒక టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా రాజమౌళి అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి జక్కన్న చేయబోయే SSMB29 సినిమాపై హాలీవుడ్ కూడా ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఆర్ఆర్ఆర్ తో ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబల్ అవార్డులని అందుకున్నారు. అలాగే నాటునాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ వచ్చింది. ఈ నాటునాటు సాంగ్ కి ప్రపంచం మొత్తం ఊగిపోయింది. దీంతో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై వరల్డ్ వైడ్ గా మీడియా దృష్టి ఉండబోతోంది. మరి జక్కన్న ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి కథని చెబుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.