Begin typing your search above and press return to search.

గ్రౌండ్ లో స్టార్ హీరోలు ర‌చ్చ ర‌చ్చేనా!

స్టార్ హీరోలు గ్రౌండ్ లో రచ్చ‌కి రెడీ అవుతున్నారా? ఒకర్ని మించి ఒక‌రు పోటీకి ముస్తాబుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది

By:  Tupaki Desk   |   19 March 2024 8:33 AM GMT
గ్రౌండ్ లో స్టార్ హీరోలు ర‌చ్చ ర‌చ్చేనా!
X

స్టార్ హీరోలు గ్రౌండ్ లో రచ్చ‌కి రెడీ అవుతున్నారా? ఒకర్ని మించి ఒక‌రు పోటీకి ముస్తాబుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రం బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క త్వంలో ఓ రా అండ్ ర‌స్టిక్ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 20న సినిమా ప్రారంభం కానుంది. ఓ ఆట‌ను కేంద్రంగా చేసుకుని బ‌ల‌మైన భావోద్వేగ‌తంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ బోతున్నారుట‌. ఇందులో చ‌ర‌ణ్ క్రీడాకారుడి పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఆ ఆట క‌బ‌డ్డీ లేదా పుట్ బాల్ నేప‌థ్య‌మ‌ని లీకులందుతున్నాయి. ఇదే నిజ‌మైతే చ‌ర‌ణ్ తొలిసారి క్రీడాకా రుడి రోల్ ఇదే అవుతుంది. ఇంత‌వ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర‌లు ఆయ‌న పోషించ‌లేదు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ స్నేహితుడు శ‌ర్వానంద్ కూడా స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ఓస్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. అభిలాష ద‌ర్శ‌క‌త్వంలో బైక్ రేసింగ్ నేప‌థ్యంలో ఓ పీరియాడిక‌ల్ స్పోర్స్ట్ డ్రామాగా దీన్ని తెర‌కెక్కి స్తున్నారుట‌. ఇందులో బైక్ రేస‌ర్ పాత్ర‌లో శ‌ర్వానంద్ క‌నిపించనున్నాడు.

అలాగే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా సాగ‌ర్. కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో 'టైసన్ నాయుడు' అనే చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. పోలీస్ యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమాలో స్పోర్స్ట్ నేప‌థ్యం కూడా ఉన్న‌ట్లు తెలిసింది. ఇక కోలీవుడ్ హీరోలు ఆర్య‌...దృవ్ కూడా క్రీడా నేప‌థ్యాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. `సార్ప‌ట్ట‌`లో బాక్స‌ర్ గా అల‌రించిన ఆర్య ఇప్పుడా సినిమా సీక్వెల్ కి రెడీ అవుతున్నాడు.

మ‌రోసారి బాక్స‌ర్ గా మారేందుకు రెడీ అవుతున్నాడు. పా .రంజిత్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నా డు. అలాగే దృవ్ విక్ర‌మ్ తో క‌లిసి ఓ సినిమా చేస్తున్నాడు. క‌బ‌డ్డీ క్రీడాకారుడు మాన‌తి పి. గ‌ణేష‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ చిత్రాన్ని మారి సెల్వ‌రాజ్ తెర‌కెక్కిస్తున్నాడు. ఇక మాధ‌వ‌న్..సిద్దార్ధ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఎస్. శిశికాంత్ టెస్ట్ అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. చెన్నై లో జ‌రిగిన ఓ టెస్ట్ మ్యాచ్ అధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.