Begin typing your search above and press return to search.

శింబు 'థగ్ లైఫ్'.. మల్టీస్టారర్ పవర్ఫుల్ రేస్

విలక్షణ నటుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2024 7:29 AM GMT
శింబు థగ్ లైఫ్.. మల్టీస్టారర్ పవర్ఫుల్ రేస్
X

విలక్షణ నటుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి 'థగ్‌ లైఫ్‌' చిత్రం. స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం చాలా ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం చేతులు కలిపారు. మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ ఢిల్లీలోని సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిర్‌ లో జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


తాజాగా మేకర్స్... ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కోలీవుడ్ నటుడు సిలంబరసన్ (శింబు) ఫస్ట్ లుక్‌ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. దాంతోపాటు గ్లింప్స్ ను కూడా రివీల్ చేశారు. అయితే ఈ సినిమాలో శింబు బదులు.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు థగ్ లైఫ్ మేకర్స్.. శింబు గ్లింప్స్ ను విడుదల చేయడంతో ఆ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

సినిమాలో శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూవీపై అంచనాలు పెంచేసింది. శింబు తన మార్క్‌ ను చూపిస్తూ.. కారులో పిస్తోల్‌ పట్టుకుని స్టైలిష్‌ గా ఎంట్రీ ఇస్తున్న విజువల్స్‌ అదిరిపోయాయి. ఎడారి ఇసుక తిన్నెలపై కారు నడుపుతూ కనిపించిన శింబు.. ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేసి కారును స్కిడ్ చేసిన సీన్ వేరే లెవల్ లో ఉంది.

ఇక ఈ మూవీలో శింబు... కమల్ హాసన్ కొడుకు రోల్ పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్‌ తోపాటు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఐశ్వర్యలక్ష్మి, త్రిష ఫిమేల్‌ లీడ్ రోల్స్‌ పోషిస్తున్నారు. కార్తీక్‌, జోజు జార్జ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ కమల్ హాసన్‌- ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో గ్రాండ్ క్లాసిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతోంది.

అయితే లోక్ సభ ఎన్నికల వల్ల కొద్దిరోజుల పాటు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్.. ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మేకర్స్ మరో అప్డేట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ నటించిన కల్కి మూవీ జూన్ 27వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత ఇండియన్-2 మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి వరుస చిత్రాలతో కమల్ హాసన్ ఎలాంటి హిట్లు అందుకుంటారో చూడాలి.