Begin typing your search above and press return to search.

శృతి హాసన్.. ఈ గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే..

ప్రస్తుతం ఆమె చేతిలో సలార్ 2తో పాటు అడవిశేష్ తో చేస్తోన్న డెకాయిట్ మూవీ ఉంది.

By:  Tupaki Desk   |   26 April 2024 4:58 PM GMT
శృతి హాసన్.. ఈ గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే..
X

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శృతి హాసన్. ఈ అమ్మడు గత ఏడాది సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో సలార్ 2తో పాటు అడవిశేష్ తో చేస్తోన్న డెకాయిట్ మూవీ ఉంది. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.


కమల్ హాసన్ వారసురాలిగా ఆమె సినీ అరంగేట్రం చేసింది. తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమెకి సక్సెస్ లభించింది మాత్రం గబ్బర్ సింగ్ మూవీతోనే. పవన్ కళ్యాణ్ కి జోడీగా ఈ సినిమాలో శృతి హాసన్ నటించింది. ఈ మూవీ తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.


తెలుగు, తమిళ్ భాషలలో స్టార్ హీరోలు అందరితో కూడా శృతి హాసన్ జతకట్టింది. గత ఏడాది సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో నటించింది. బాలయ్యతో వీరసింహారెడ్డి మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 2023లో మొత్తం హ్యాట్రిక్ హిట్స్ శృతి హాసన్ ఖాతాలో చేరాయి. అయితే శృతి హాసన్ కి అవకాశాలు వస్తున్న కూడా ఈమె మాత్రం గ్యాప్ తీసుకుంటూ సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది.


అయితే సోషల్ మీడియాలో మాత్రం శృతి హాసన్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలని పంచుకుంటుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తాయి. తన బాయ్ ఫ్రెండ్ శాంతనుతో కలిసి స్పెండ్ చేసిన పిక్స్ కూడా ఇన్ స్టాగ్రామ్ లో శృతి హాసన్ షేర్ చేసుకుంటూ ఉంటుంది.


ఇదిలా ఉంటే తాజాగా గ్లామరస్ ఫోటోషూట్ లో పాల్గొన్న అమ్మడు పోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ట్రెడిషనల్ గా ఎథినిక్ స్టైల్ లో ఉండే అవుట్ ఫిట్ ధరించి శృతి హాసన్ ఫోటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలని రెండు గంటల్లోనే 79 వేలమందికి పైగా లైక్ చేయడం విశేషం. నెటిజన్లు శృతి హాసన్ ఫోటోలకి ఆసక్తికర కామెంట్స్ పెడుతున్నారు. గత కొద్ది రోజులుగా బాయ్ ఫ్రెండ్ శాంతనుతో శృతి హాసన్ కి బ్రేక్ అప్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. దీనిపై నెటిజన్లు ఆమెని ఇన్ స్టాగ్రామ్ లో క్వశ్చన్ చేస్తూ ఉండటం విశేషం.