Begin typing your search above and press return to search.

టూపీస్ లో రాజ్ పుత్ వార‌సురాలు ట్రీట్!

రాజ్ పుత్ వార‌సురాళ్ల అందం గురించి వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం. నాటి మేటి నాయిక‌ల నుంచి బ్యూటీలో ఒక్కొక్క‌రిది ఒక్కో ప్ర‌త్యేక‌త‌

By:  Tupaki Desk   |   9 May 2024 8:44 AM GMT
టూపీస్ లో రాజ్ పుత్ వార‌సురాలు ట్రీట్!
X

రాజ్ పుత్ వార‌సురాళ్ల అందం గురించి వ‌ర్ణించ‌డం ఎవ‌రికి సాధ్యం. నాటి మేటి నాయిక‌ల నుంచి బ్యూటీలో ఒక్కొక్క‌రిది ఒక్కో ప్ర‌త్యేక‌త‌. తెలుగులో పాయ‌ల్ రాజ్ పుత్ ఎంత ఫేమ‌స్ అయిందో తెలిసిందే. అటుపై అదే వంశం నుంచి శోభితా రాణా కూడా ఎంట్రీ ఇచ్చింది. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన 'రంగ రంగ వైభ‌వంగ'లో న‌టించింది. ఆ సినిమా పెద్ద‌గా రీచ్ అవ్వ‌క‌పోవ‌డంతో శోబిత రాణా హైలైట్ కాలేదు కానీ..హిట్ అయితే ఆ లెక్క వేరే లెవల్లో ఉండేది.

అయినా అమ్మ‌డు టాలీవుడ్ అటెన్ష‌న్ డ్రా చేస్తూనే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన స్టా వేదిక‌గా హాట్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. తాజాగా శోభిత నుంచి మ‌రో హాట్ సెన్షేష‌న్ బ‌య‌ట‌కొచ్చింది.. అమ్మ‌డి బికినీ పోజిలిప్పుడు నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. పూల్ వ‌ద్ద చార‌ల టూపీస్ లో హాట్ హాట్ గా ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది. అస‌లే అమ్మ‌డు హైట్.. అలాంటి బ్యూటీ నుంచి పూల్ ఫోజులు లీకైతే నెట్టింట ప్ర‌కంప‌న‌లు త‌ప్ప‌వుగా. వివిధ భంగిమ‌ల్లో ఇచ్చిన ఫోటోలు కొన్ని వైర‌ల్ గా మారాయి. వాటిపై కుర్రాళ్ల కామెంట్లు అంతే ఆస‌క్తిక‌రం.

మ‌రి ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలేవైనా టాలీవుడ్ లో అవ‌కాశాలు తెచ్చి పెడ‌తాయా? అన్న‌ది చూడాలి. శోభిత పంజాబీ చిత్రం 'కెనడా డి ఫ్లైట్‌'లో రూప్ పాత్రతో వెలుగులోకి వ‌చ్చింది. అటుపై కబీర్ సదానంద్ దర్శకత్వం వహించిన 'గోలు అండ్ పప్పు' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'ఇష్క్ బ్రాందీ' చిత్రంలోనూ న‌టించింది. 'రాజా మీరు కేక' ..'రామరాజ్య' కన్నడంలో 'షాడో' లాంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఏ భాష‌లోనూ స్థిర‌ప‌డ‌లేక‌పోయింది.

అవ‌కాశాలు వ‌చ్చినా అవి పెద్ద‌గా సక్సెస్ అవ్వ‌క‌పోవ‌డంతో వివిధ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బండి లాగిస్తుంది. బుల్లి తెర‌పైనా స‌త్తా చాటే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. వెబ్ సిరీస్ ల్లో న‌టించాల‌ని ఆస‌క్తి చూపిస్తుంది. వైల్డ్ కార్డ్ పెర్ఫార్మర్‌గా ఇండియాస్ బెస్ట్ సినీస్టార్స్ కి ఖోజ్ అనే రియాల్టీ షోలో కూడా కనిపించింది. నా హీరేను సతా అనే మ్యూజిక్ వీడియోలో నటించింది.