Begin typing your search above and press return to search.

సీక్వెల్‌ తో మెసేజ్ ఇవ్వబోతున్న స్టార్‌ హీరో

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   25 April 2024 7:11 AM GMT
సీక్వెల్‌ తో మెసేజ్ ఇవ్వబోతున్న స్టార్‌ హీరో
X

టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ఇలా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లో కూడా సీక్వెల్స్ జోరు కొనసాగుతోంది. స్టార్‌ హీరోల సినిమాలకు మాత్రమే కాకుండా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా సీక్వెల్స్ వస్తున్న ఈ సమయంలో తమిళ ప్రేక్షకులు కార్తి హీరోగా నటించి హిట్ అయిన సర్ధార్ సినిమాకు సీక్వెల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన రా ఏజెంట్‌ మూవీ 'సర్దార్‌' కి తమిళనాట మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. సర్దార్‌ లో కార్తి లుక్ కి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మొత్తానికి సర్దార్‌ విడుదల అయిన సమయంలోనే సీక్వెల్‌ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇటీవలే సర్దార్‌ 2 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయ్యిందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సీక్వెల్‌ గురించి ఆసక్తికర ప్రచారం జరగుతోంది. డ్రగ్స్ మరియు మహిళల అక్రమ రవాణ అంశాలతో సర్ధార్ 2 ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యువతకు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ను ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా డ్రగ్స్ కు అలవాటు పడటం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న కార్తి వంటి స్టార్‌ హీరో సినిమాలో ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా యువతలో కొంతలో కొంత అయినా మార్పు వస్తే మంచిదే కదా అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం కార్తి చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే సర్దార్‌ 2 మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.