Begin typing your search above and press return to search.

పొట్టేల్ కోసం రంగంలోకి వంగా.. ఇక ఈలలే!

తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో గురువారం సాయంత్రం 05.18 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

By:  Tupaki Desk   |   17 April 2024 12:07 PM GMT
పొట్టేల్ కోసం రంగంలోకి వంగా.. ఇక ఈలలే!
X

సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తప్పక ఆదరిస్తామని ఇప్పటికే ఆడియన్స్ పలుమార్లు నిరూపించారు. కాంతార, బలగం, హనుమాన్ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు.. చిన్న చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు అలాంటి కోవకే చెందుతున్నట్టు అనిపిస్తున్న మరో సినిమా పొట్టేల్. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం.

బంధం రేగడ్, సవారీ సినిమాల‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాహిత్ మోతుకూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవల అనన్య.. తంత్రతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక పొట్టేల్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు, మూడు పాటలకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్ లో గురువారం సాయంత్రం 05.18 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు వెల్లడించారు.

టీజర్ ను లాంఛ్ చేసి.. మూవీ టీమ్ లో ఫుల్ జోష్ నింపనున్నారు సందీప్ రెడ్డి వంగా. అయితే ప్రమోషన్స్ లో భాగంగా టీజర్ లాంఛ్ కు సంబంధించి క్రేజీ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. క్యాస్టింగ్ అంతా.. ఈవెంట్ కు ఎవరిని గెస్ట్ గా పిలవాలని చర్చించుకుంటారు. పవన్ కళ్యాణ్ తో రిలీజ్ చేయిద్దామని అనుకుంటే ఆయన బిజీగా ఉన్నారని గుర్తు చేసుకుంటారు. చిరంజీవి, రాజమౌళి పేర్లను కూడా పరిశీలిస్తుంటారు. చివర్లో డైరెక్టర్ వచ్చి చీఫ్ గెస్ట్ ఎవరో డిసైడ్ అయిపోయిందని.. సందీప్ రెడ్డి వంగా అని చెబుతారు. కామెడీ డైలాగులతో ఈ వీడియో నవ్వులు పూయిస్తోంది.

ఇక పొట్టేల్ సినిమాను ఎన్ ఐ ఎస్ ఏ ఎంటర్టైన్మెంట్, ప్రగ్యా సన్నిధి క్రియేషన్స్ బ్యానర్లపై నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్లతో పాటు అజయ్, ప్రియాంక శర్మ, తనస్వీ చౌదరి, ఛత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్ తదితరులు నటిస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.