Begin typing your search above and press return to search.

సామ్ ఫోటో షూట్.. డీసెంట్ వ‌ర్సెస్ బోల్డ్

తాజాగా మ‌రో స్పెష‌ల్ బోల్డ్ ఫోటోషూట్ తో ఆక‌ట్టుకుంది. స‌మంత వైట్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి బాట‌మ్ లెస్ లుక్ తో గుబులు రేపింది.

By:  Tupaki Desk   |   17 April 2024 12:20 PM GMT
సామ్ ఫోటో షూట్.. డీసెంట్ వ‌ర్సెస్ బోల్డ్
X

స‌మంత రూత్ ప్రభు ఇటీవ‌లే న‌ట‌న‌లో త‌న కంబ్యాక్ గురించి ఘ‌నంగా ప్ర‌క‌టించింది. కెరీర్ ప‌రంగా బిజీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, వ‌రుస చిత్రాల్లో న‌టిస్తాన‌ని తెలిపింది. సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ తో ప్రారంభ‌మైన సామ్ త‌దుప‌రి వేరొక భారీ చిత్రాన్ని ప్ర‌క‌టిస్తుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. అయితే సామ్ నుంచి ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డే వ‌ర‌కూ సోష‌ల్ మీడియాల్లో అభిమానుల‌ను యంగేజ్ చేసేందుకు వేడెక్కించే ఫోటోషూట్ల‌తో దూసుకొస్తోంది.

ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో సామ్ స్పీడ్ పెంచింది. బోల్డ్ ఫోటోషూట్ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. తాజాగా మ‌రో స్పెష‌ల్ బోల్డ్ ఫోటోషూట్ తో ఆక‌ట్టుకుంది. స‌మంత వైట్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి బాట‌మ్ లెస్ లుక్ తో గుబులు రేపింది. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్ కి త‌గ్గ‌ట్టే చేతికి గ‌డియారాలు మ్యాచ్ అయ్యాయి. సామ్ స్ట‌న్నింగ్ లుక్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

మయోసిటిస్ నుండి కోలుకున్న తర్వాత సమంతా పూర్తి ఫిట్ లుక్ కోసం చాలా ప్ర‌య‌త్నించింది. దానికోసం గ్యాప్ తీస్కుంది. ఈ వ్యూహం బాగానే వ‌ర్క‌వుటైంది. త‌దుప‌రి అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్, సిటాడెల్: హనీ బన్నీ విడుదల కోసం సమంత‌ వేచి చూస్తోంది. హ‌నీ బ‌న్నీ ప్ర‌చారం కోసం సామ్ సిద్ధ‌మ‌వుతోంది.

అలాగే స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న త‌దుప‌రి చిత్రంలో న‌టించే అవ‌కాశం ఉంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. కానీ ఇంకా అధికారికంగా ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. తాప్సీ నిర్మాణ సంస్థ‌లోను స‌మంత న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.