Begin typing your search above and press return to search.

బ్యాండేజ్ ప్యాచ్ తో SKN టీమ్ సెటైరా?.. ఒరిజినల్ పిక్ తో చెక్

మెగా అభిమానిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగారు నిర్మాత శ్రీనివాస కుమార్- SKN

By:  Tupaki Desk   |   24 April 2024 2:10 PM GMT
బ్యాండేజ్ ప్యాచ్ తో SKN టీమ్ సెటైరా?.. ఒరిజినల్ పిక్ తో చెక్
X

మెగా అభిమానిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. అంచెలంచెలుగా ఎదిగారు నిర్మాత శ్రీనివాస కుమార్- SKN. గతేడాది బేబీ సినిమా నిర్మించి భారీ విజయం సాధించారు. ఆ మూవీతో ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. అంతకుముందు కూడా పలు చిత్రాలు తీసినా బేబీ మూవీ సక్సెస్ ఎస్కేఎన్ లో ఫుల్ జోష్ నింపింది. పలు సినిమా ఈవెంట్స్ లో తన స్పీచులతో కూడా బాగా వైరల్ అయ్యారు ఎస్కేఎన్.

అయితే ఇటీవల ముగ్గురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు ఎస్కేఎన్ కు రోడ్డు ప్రమాదం జరిగినట్లు కొందరు నెటిజన్లు వదంతులు ప్రచారం చేస్తున్నారు. నలుగురి ముఖాలపై బ్యాండేజ్ ప్యాచ్ లు వేసి ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన పిక్ ను షేర్ చేస్తున్నారు. వైరల్ అయిన ఆ పిక్ లో ఎస్కేఎన్ తోపాటు టాలీవుడ్ దర్శకులు సాయి రాజేష్, బన్నీ వాసు, డ్యాన్స్ మాస్టర్ జానీ ఉన్నారు. ఆ ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ నలుగురికి గాయాలైనట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.

అంతే కాకుండా పొలిటికల్ గా కొందరి నాయకులపై సెటైర్లు వేసే విధంగా ఇలా ఫొటోలు క్రియేట్ చేస్తున్నట్లు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ విషయంపై ఎస్కేఎన్ సోషల్ మీడియాలో స్పందించారు. తమకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. "లేదు, నిజం కాదు, ఎవరో ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. అసలైన పిక్ ఇదే" అంటూ ఒరిజినల్ పిక్ ను షేర్ చేశారు. అందులో వాళ్లకు ఎలాంటి గాయాలు అయినట్లు కనిపించడం లేదు. దీంతో కొందరు నెటిజన్లు కావాలనే మార్ఫింగ్ చేసి ఆ పిక్ ను వైరల్ చేస్తున్నట్లు ఈజీగా అర్థమవుతుంది.

అయితే ఇండస్ట్రీలో ఎవరి విషయంలోనైనా ఇలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు. కావాలనే వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ ఫోటో విషయంపై ఎస్కేఎన్ తోపాటు బన్నీ వాసు, జానీ మాస్టర్, సాయి రాజేష్ ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదా లైట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. బేబీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు ఎస్కేఎన్. సాయి రాజేష్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు. పలువురు స్టార్ కిడ్స్ బాలీవుడ్ బేబీలో నటించనున్నట్లు సమాచారం. సాయి రాజేష్ కథ అందిస్తుండగా.. బేబీ హీరోహీరోయిన్లతో మరో సినిమా కూడా ఎస్కేఎన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో రవి నంబూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో డైరెక్టర్ గా సుమన్ పాతూరిని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. కలర్ ఫొటో దర్శకుడు సందీప్ రాజ్ తో ఓ చిత్రాన్ని తీయనున్నారు.