Begin typing your search above and press return to search.

ఫారిన్ రోడ్ల మీద రొమాంటిక్ బ్యూటీ హంగామా..!

కెతిక శర్మ లేటెస్ట్ గా ఫారిన్ వీధుల్లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. తనదైన శైలిలో వెరైటీ ఫోజులతో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ అదిరిపోయాయి.

By:  Tupaki Desk   |   8 May 2024 1:25 PM GMT
ఫారిన్ రోడ్ల మీద రొమాంటిక్ బ్యూటీ హంగామా..!
X

డబ్ స్మాష్ వీడియోస్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన కెతిక శర్మ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దృష్టిలో పడింది. తనయుడు ఆకాష్ పూరీతో పూరీ జగన్నాథ్ నిర్మించిన రొమాంటిక్ సినిమాలో కెతికకు ఆఫర్ ఇచ్చారు. హీరోయిన్స్ కెరీర్ పై తొలి సినిమా ఇంపాక్ట్ బాగా ఉంటుంది. ఈ క్రమంలోనే రొమాంటిక్ సినిమాలో కెతిక గ్లామర్ షో ఎంత చేసినా సినిమా కమర్షియల్ సక్సెస్ చేసేందుకు ఉపయోగపడలేదు. రొమాంటిక్ తర్వాత నాగ శౌర్యతో లక్ష్య సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా సక్సెస్ అందుకోలేదు.

థర్డ్ అటెంప్ట్ గా మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమా చేయగా అది కూడా తుస్సుమన్నది. చేసిన 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల కెతిక శర్మ గురించి పట్టించుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్, సాయి దుర్గ తేజ్ నటించిన బ్రో సినిమాలో తేజ్ లవర్ గా నటించింది కెతిక. ఆ సినిమా జస్ట్ ఓకే అనిపించుకున్నా కూడా కెతికకు ఏమాత్రం హెల్ప్ అవ్వలేదు. అయితే తన సినిమాల వల్ల ఎలాగు ఆఫర్లు రావట్లేదు కాబట్టి మళ్లీ సోషల్ మీడియా మీద ఫోకస్ చేసింది కెతిక.

అందుకే వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. కెతిక ఫాలోవర్స్ అంతా కూడా అమ్మడు చేసే గ్లామర్ షోని ఎంజాయ్ చేస్తున్నారు. కెతిక శర్మ లేటెస్ట్ గా ఫారిన్ వీధుల్లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. తనదైన శైలిలో వెరైటీ ఫోజులతో అమ్మడు ఇచ్చిన స్టిల్స్ అదిరిపోయాయి. గ్లామర్ షోలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అయితే కెతిక స్టైల్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంది. ఫారిన్ స్ట్రీట్స్ లో అందాల భామ ఇలా రెచ్చిపోవడం చూసి ఇంత అందగత్తెకు ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదని అనుకుంటున్నారు ఆడియన్స్.

బ్రో చేసి ఏడాది అవుతున్నా కెతికకు ఒక్క ఆఫర్ కూడా రాలేదు. అందుకే ఉన్న ఈ ఫ్రీ టైం లో సోషల్ మీడియాలోనే అమ్మడు తన టాలెంట్ చూపిస్తుంది. కెరీర్ లో ఒక సక్సెస్ వస్తే చాలు ఆ తర్వాత తన సత్తా చాటేలా చూస్తున్న కెతిక రాబోయే రోజుల్లో అయినా సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి. కెతిక శర్మ లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఎవరైనా సరే అమ్మడు షో చూసి అదుర్స్ అనాల్సిందే.