Begin typing your search above and press return to search.

ఆరెంజ్ హిట్.. మగధీర ఫ్లాప్‌!

ఆరెంజ్‌ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ మగధీర సినిమా రీ రిలీజ్‌ ని మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.

By:  Tupaki Desk   |   28 March 2024 12:34 PM GMT
ఆరెంజ్ హిట్.. మగధీర ఫ్లాప్‌!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ లు అనేవి కామన్‌ అయ్యాయి. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు ఎన్నో ఇప్పటికే రీ రిలీజ్ అయ్యాయి. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ సినిమాలను కూడా రీ రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఆనవాయితీ కొనసాగుతోంది.

నిన్న రామ్‌ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మగధీర సినిమాను విడుదల చేసిన మేకర్స్ ని నిరాశే మిగిలింది. వసూళ్ల విషయంలో ఎంతో ఊహించుకుంటే కొంతే వచ్చినట్లు మెగా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

చరణ్‌ కెరీర్‌ ఆరంభంలో వచ్చిన ఫ్లాప్ మూవీ ఆరెంజ్ ను ఆ మధ్య రీ రిలీజ్ చేశారు. భారీ మొత్తంలో వసూళ్లు నమోదు చేసిన ఆరెంజ్ అప్పుడు కాకున్నా ఇప్పుడు భారీ వసూళ్లు నమోదు చేసింది. ఇంత మంచి సినిమాను అప్పుడు ఎందుకు ఫ్లాప్ చేశారో అన్నట్లు నెట్టింట మెగా ఫ్యాన్స్‌ లో చర్చ జరిగింది.

ఆరెంజ్‌ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వచ్చింది. కానీ మగధీర సినిమా రీ రిలీజ్‌ ని మాత్రం ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కొందరు మెగా ఫ్యాన్స్ బర్త్‌ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేశారు కానీ ఓవరాల్‌ గా మగధీర సినిమా రీ రిలీజ్ లో తీవ్రంగా నిరాశ పరిచింది.

ప్రస్తుతం రామ్‌ చరణ్‌ సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ మరో రెండు నెలలు మాత్రమే బ్యాలన్స్ ఉందని, అయిదు నెలల్లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత దిల్‌ రాజు ప్రకటించాడు.

మరో వైపు బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ మూవీ చేయబోతున్నాడు. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటించబోతుంది. ఈ రెండు సినిమాలు కూడా మెగా ఫ్యాన్స్ కి కచ్చితంగా కన్నుల పండుగ గా నిలవడం ఖాయం అనే టాక్‌ వినిపిస్తుంది.