Begin typing your search above and press return to search.

'కుబేర' ఏం చేస్తున్నాడో చెప్పిన రష్మిక

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   25 April 2024 2:30 PM GMT
కుబేర ఏం చేస్తున్నాడో చెప్పిన రష్మిక
X

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కుబేర సినిమాలో నాగార్జునను పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో చూడబోతున్నామట. శేఖర్‌ కమ్ముల నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలతో పోల్చితే ఈ సినిమా చాలా విభిన్నంగా మరియు ప్రత్యేకంగా ఉంటుందని ఆయన సన్నిహితులు ఆఫ్‌ ది రికార్డ్‌ అంటున్నారు.

ఇక కుబేరా సినిమా షూటింగ్‌ ఎక్కడి వరకు వచ్చింది, అసలు షూటింగ్‌ ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా చెప్పడం లేదు. కానీ తాజాగా రష్మిక మందన్న ఆ విషయాన్ని గురించి చెప్పుకొచ్చింది.

ముంబైలో కుబేర సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ చిత్రీకరిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ముంబై షూటింగ్‌ కు సంబంధించిన పిక్ ను రష్మిక షేర్‌ చేయడంతో ప్రస్తుతం కుబేర సినిమా అక్కడ షూటింగ్‌ జరుగుతున్నట్లుగా క్లారిటీ వచ్చింది.

ధనుష్ తో శేఖర్‌ కమ్ముల సినిమాను ప్రకటించి చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ ప్రారంభం అవ్వడం, ఈ సినిమాలో నాగార్జున నటిస్తుండటంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.