Begin typing your search above and press return to search.

రామాయణం లీక్స్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట

కానీ దానిలో ఎలాంటి వాస్తవం లేదనే టాక్ బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ ఫోటోలు కేవలం టెస్ట్ షూట్ కి సంబందించినవి అయ్యుంటాయని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 5:36 AM GMT
రామాయణం లీక్స్.. అసలు మ్యాటర్ ఇదన్నమాట
X

రామాయణం కథ దశాబ్దాలుగా భారతీయ సమాజంలో భాగం అయిపొయింది. దీనిని కొందరు కేవలం మైథాలజీ ఫిక్షనల్ స్టోరీ అని అంటారు. అయితే హిందుత్వాన్ని బలంగా నమ్మేవారు రామాయణం భారతదేశంలో నిజంగా జరిగిన కథ అని చెబుతారు. రామాయణం కథని ఇప్పటికి చాలా మంది ఆదర్శంగా తీసుకుంటారు. రామాయణంలోని ప్రతి పాత్ర కూడా మానవ సమాజానికి గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే ఈ కథతో ఇండియన్స్ కి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది.

రామాయణం ఇతివృత్తాన్ని ఎన్ని సార్లు సినిమాలుగా, సీరియల్స్ గా తెరకెక్కించిన ప్రేక్షకులు ఆధరిస్తూనే ఉన్నారు. అయితే ఇతిహాసాల్లో ఉన్న రామాయణాన్ని కాకుండా సొంత ఆలోచనలతో ఊహాజనిత కల్పనలు జోడించి చెబితే మాత్రం ప్రేక్షకులు తిరస్కరిస్తారు. ఆదిపురుష్ మూవీతో ఇది ప్రూవ్ అయ్యింది. రామాయణంలో ఉన్న పాత్రలని కొత్తకోణంలో చూపించాలని ప్రయత్నం చేసిన ఓం రౌత్ ఆడియన్స్ ని మెప్పించడంలో ఫెయిల్ అయ్యాడు.

అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణం సిరీస్ గా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా కనిపించబోతోంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో సీతాదేవి గెటప్ లో సాయి పల్లవి, రాముడిగా రణబీర్ కపూర్ ఉన్నాడు. అయితే ఈ ఫోటోలు షూటింగ్ నుంచి లీక్ అయ్యాయనే ప్రచారం నడిచింది.

కానీ దానిలో ఎలాంటి వాస్తవం లేదనే టాక్ బిటౌన్ లో వినిపిస్తోంది. ఈ ఫోటోలు కేవలం టెస్ట్ షూట్ కి సంబందించినవి అయ్యుంటాయని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంటున్నారు. మూవీ తెరకెక్కబోతోందని క్లారిటీ ఇవ్వడం కోసం చిత్ర యూనిట్ ఇలా లీక్ చేసి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇలాంటి సినిమాల నుంచి ఫోటోలు లీక్ అయితే ఫస్ట్ లుక్ మీద ఉన్న క్యూరియాసిటీ తగ్గిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కచ్చితంగా షూటింగ్ విషయంలో నితీష్ తివారి టీం జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇవి కావాలని లీక్ చేసి ఉంటే తప్పులేదని, అలా కాకుండా ఎవరైనా ఇంటెన్షల్ గా లీక్ చేసి ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తుందని విషయం అయితే కన్ఫర్మ్ అయిపొయింది. దీంతో కచ్చితంగా బాలీవుడ్ రామాయణానికి సౌత్ లో కూడా మంచి ఆదరణ లభించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.