Begin typing your search above and press return to search.

రజినీకాంత్.. ఈసారి మంచోడు కాదు!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు

By:  Tupaki Desk   |   29 March 2024 4:28 AM GMT
రజినీకాంత్.. ఈసారి మంచోడు కాదు!
X

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది లాల్ సలామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. గత ఏడాది జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సూపర్ స్టార్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. లాల్ సలామ్ లో రజినికాంత్ గెస్ట్ అప్పీరియన్స్ లాంటి క్యారెక్టర్ చేశారు. అందుకే ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఓన్ చేసుకోలేదు. జై భీమ్ ఫేమ్ జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో రజినీకాంత్ ప్రస్తుతం ఒక మూవీ చేస్తున్నాడు.

సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రజినీకాంత్ జత కట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే లోకేష్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మూవీకి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. రజినీకాంత్ ఫస్ట్ లుక్ తో తైలవర్ 171 పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ డిఫరెంట్ గా మాసివ్ లుక్ లో కనిపిస్తూ ఉండటం విశేషం.

ఇంతకాలం సాఫ్ట్ లుక్స్ లోనే సూపర్ స్టార్ ని అభిమానులు ఎక్కువగా చూశారు. అయితే రజినీతోనే నెగిటివ్ రోల్ చేయించి శంకర్ రోబో మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సారి లోకేష్ కనగరాజ్ కూడా అలాంటి సాహసమే చేస్తున్నాడంట. తలైవర్ 171 సినిమాలో రజినీకాంత్ గ్యాంగ్ స్టార్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడంట. అతని ఫస్ట్ లుక్ కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తోంది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఏప్రిల్ 22న టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు లోకేష్ కనగరాజ్ అప్డేట్ ఇచ్చాడు. దీనిని బట్టి మూవీ షూటింగ్ విషయంలో లోకేష్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడని అర్ధమవుతోంది. టీజర్ తో పాటే టైటిల్ కూడా రివీల్ చేస్తారేమో అనేది చూడాలి. ఈ మధ్యకాలంలో నెగిటివ్ హీరోయిజం ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతోంది. కేజీఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ ఆడియన్స్ మైండ్ సెట్ మార్చేశాడు.

లోకేష్ దానిని కొనసాగిస్తున్నాడు. తలైవర్ మూవీ ఒక గ్యాంగ్ స్టార్ కథగానే ఉండబోతోంది. ఈ మూవీ గురించి ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. దీనికి లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా చేయడం లేదంట. ఇది కంప్లీట్ గా కొత్త కథతో కొత్త ప్రపంచంలో ఉండబోతోందంట. అందుకే లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ ని సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి క్యారెక్టరైజేషన్ లో చూపించబోతున్నాడు తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొని ఉంది.