Begin typing your search above and press return to search.

పుష్ప 2 ఫస్ట్ సాంగ్.. గట్టిగా వినిపించేలా..

మేకర్స్ రిలీజ్ చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   24 April 2024 11:03 AM GMT
పుష్ప 2 ఫస్ట్ సాంగ్.. గట్టిగా వినిపించేలా..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఇప్పటికే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయింది. మేకర్స్ రిలీజ్ చేస్తున్న ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తున్నాయి.

రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ టీజర్ కూడా ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రాబోయే అప్డేట్స్ మరింత హై లెవెల్ లో రెస్పాన్స్ అందుకోవాలి అని పుష్ప 2 టీమ్ సభ్యులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో సాంగ్స్ సినిమాకు మంచి బలాన్ని అందించాయి.

ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ సాంగ్స్ కూడా అంతకుమించి అనేలా ఉండబోతున్నట్లుగా ఇదివరకే దేవి వివరణ ఇచ్చాడు. అయితే ఫస్ట్ సాంగ్ విడుదల చేయబోతున్నట్లు గత కొన్ని గంటలుగా మైత్రి మూవీ మేకర్ సోషల్ మీడియాలో హడావిడి స్టార్ట్ చేసేసింది. ఇక మొత్తానికి మొదటి సాంగ్ ఎప్పుడూ రాబోతోందో కూడా ఒక ప్రోమో ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. మే 1వ తేదీన ఉదయం 11:07కి పుష్ప మొదటి సాంగ్ రాబోతోంది.

పుష్ప పుష్ప.. అంటూ సాగే ఈ పాటలో పుష్పరాజ్ క్యారెక్టర్ ను మరింత ఎలివేట్ చేసే విధంగా కంపోజ్ చేసినట్లు అనిపిస్తోంది. చంద్రబోస్ అందించిన లిరిక్స్ ఈసారి మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయని చేస్తాయట. దేవిశ్రీప్రసాద్ సుకుమార్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు వీరి కలయికలో వచ్చిన ప్రతి సినిమా ఆల్బమ్ కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాయి.

అందులోను అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కావడంతో తప్పకుండా ఈసారి మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పవు. ఇక ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈ సినిమాతో తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కెట్ ను టచ్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగా వరుస అప్డేట్స్ కూడా ఇవ్వబోతున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి క్యారెక్టర్ కు సంబంధించిన స్పెషల్ టీజర్స్ కూడా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ముందుగా రాబోతున్న ఈ ఫస్ట్ సాంగ్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.