Begin typing your search above and press return to search.

పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అదిరిపోయే ప్లాన్..!

దేశం మొత్తం పుష్ప 2 ట్రైలర్ చూసేలా నేషనల్ వైడ్ గా ఉన్న మల్టీప్లెక్స్ అన్నిటిలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 April 2024 10:30 AM GMT
పుష్ప 2 ట్రైలర్ లాంచ్ అదిరిపోయే ప్లాన్..!
X

ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా కోసం సౌత్ ఆడియన్స్ కన్నా ఎక్కువ ఆసక్తిగా నార్త్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. పుష్ప 1 ఈ రేంజ్ లో హిట్ అయ్యింది అంటే అది బాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా ఆ సినిమాను తమ ఓన్ చేసుకోబట్టే అని గుర్తించాల్సిందే. అందుకే పుష్ప 2 ని కూడా అక్కడ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని కూడా సుకుమార్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. పుష్ప 2 సినిమా ప్రచార చిత్రాలతోనే సినిమాపై భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుండగా సినిమా రిలీజ్ తర్వాత రికార్డుల సునామీనే అనేలా వైబ్ కనిపిస్తుంది.

పుష్ప 2 ప్రతి టీజర్ సినిమాపై డబుల్ క్రేజ్ తీసుకొస్తుంది. అయితే పుష్ప 2 సినిమా ట్రైలర్ విషయంలో మేకర్స్ భారీ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. ఈమధ్య అల్లు అర్జున్ బర్త్ డే కి రిలీజ్ చేసిన పుష్ప 2 టీజర్ తోనే భారీ వ్యూస్ తో సెన్సేషనల్ అనిపించిన సుకుమార్ ట్రైలర్ విషయంలో భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.

దేశం మొత్తం పుష్ప 2 ట్రైలర్ చూసేలా నేషనల్ వైడ్ గా ఉన్న మల్టీప్లెక్స్ అన్నిటిలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దేశంలో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ లో ఒకేసారి పుష్ప 2 ట్రైలర్ చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక్కడే కాదు ఓవర్సీస్ లో కూడా ట్రైలర్ రిలీజ్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తుంది.

పుష్ప 2 సినిమా ప్రతి విషయంలో అంచనాలను దాటేలా సుక్కు ప్లానింగ్స్ ఉంటున్నాయి. సినిమా ఏమాత్రం అంచనాలను అందుకునేలా ఉన్నా కూడా పుష్ప రాజ్ బాక్సాఫీస్ సునామీకి మిగతా సినిమా రికార్డులన్నీ కొట్టుకుపోయేలా ఉన్నాయి. పుష్ప 2 కన్నా ముందు ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమా వస్తుండగా ఆ సినిమా వచ్చిన రెండు వారాలకే పుష్ప రాజ్ హంగామా ఉండబోతుంది. అల్లు అర్జున్ మరోసారి తన నట విశ్వరూపం తో వారెవా అనిపించేస్తాడని అంటున్నారు. మరి పుష్ప 2 వెండితెర మీద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. పుష్ప 2 నార్త్ సైడ్ బిజినెస్ భారీ రేంజ్ లో ఉండగా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది తెలిసేలా చేస్తున్నారు.