Begin typing your search above and press return to search.

ప్ర‌పంచ యుద్దానికి కార‌ణాలు చెప్పిన పూరి!

తాజాగా 'భూమిపై శాంతి; పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసారు. 'ప్రతి మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే జీవిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 April 2024 7:32 AM GMT
ప్ర‌పంచ యుద్దానికి కార‌ణాలు చెప్పిన పూరి!
X

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూ ట్యూబ్ లో స్పెష‌ల్ డియోలు రిలీజ్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాను ఎంపిక చేసుకున్న అంశంపై త‌న‌దైన శైలిలో విశ్లేషిస్తూ...భ‌విష్య‌త్ ని దృష్టిలో పెట్టుకుని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా 'భూమిపై శాంతి’ పేరిట ఓ వీడియోను రిలీజ్ చేసారు. 'ప్రతి మనిషి కూడా ఎప్పుడూ సంఘర్షణలోనే జీవిస్తున్నాడు. పక్కింటి వాళ్లతో, కుటుంబంతో, సమాజంతో.. ఆఖరికి తనతో తానే ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటూనే ఉంటాడు.

మళ్లీ తన కుటుంబం.. తన భాష.. దేశం కోసం యుద్ధాలు చేస్తారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఆయుధాల ఉత్పత్తిని.. అణు బాంబులు తయారుచేయడం నిలిపివేయాలని 1965లోనే ఒక మతపెద్ద కోరారు.

అప్పట్లో ఆ స్పీచ్‌ బాగా వైరల్ అయింది. మతాలేవైనా ఎన్నో వేల ఏళ్ల నుంచి కూడా శాంతి గురించే మాట్లాడాం. కానీ ఇప్పటివరకు జరిగిన ప్రతీ యుద్ధం మతాల వల్లే జరిగింది. అలా ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దేశాల మధ్య.. గ్రూపుల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి.

యుద్ధం లేకుండా మనకు శాంతి లేదన్నట్టుగా మారింది. అసలు యుద్ధాలను ఆపాలంటే ముందు మనమధ్య జరిగే చిన్న చిన్న గొడవలను ఆపాలి. ఒకరిని ఒకరు అసహ్యించుకోవడం తగ్గించాలి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ వల్ల ఒక తరం విడిపోవచ్చు. తర్వాత ఆ ఊరు రెండు ముక్కలవొచ్చు. అది అలా పెరిగీ పెరిగీ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయొచ్చు. ఒక చిన్న తగాదా కూడా వైరస్‌ లా వ్యాపించి వెయ్యేళ్లు కొనసాగుతుంది.

అందుకే దేనికైనా ప్రారంభంలోనే ఫుల్‌ స్టాప్‌ పెట్టాలి. మన మతాన్ని ప్రేమించడంతో పాటు ఎదుటి వారి మతాన్ని గౌరవించాలి. పక్కవారితో ఏమాత్రం పరుషంగా మాట్లాడినా.. ఏదో ఒకరోజు గొడవగా మారుతంది. అణు బాంబులు తయారు చేయడం వల్లో, ఆపేయడం వల్లో యుద్ధాలు రావడం, ఆగడం ఉండ‌దు. అణు బాంబుల వంటి ఆలోచనల వల్లే అన్ని సమస్యలు వ‌స్తాయి. అంతా ప్రశాంతంగా ఉండాలి. ఎదుటివారిని ప్రశాంతంగా ఉండనివ్వాలి' అని చెప్పుకుంటూ వ‌చ్చారు.