Begin typing your search above and press return to search.

గులాబీ లాంటి పాప.. హై గ్లామర్ డోస్

ఇదిలా ఉంటే తాజాగా ఈ తెలుగు బొమ్మ ఇన్ స్టాగ్రామ్ తో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్ ధరించి అందాలతో కనువిందు చేస్తోంది.

By:  Tupaki Desk   |   28 April 2024 4:26 AM GMT
గులాబీ లాంటి పాప.. హై గ్లామర్ డోస్
X

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెలుగమ్మాయిల హవా గట్టిగానే పెరుగుతోంది. కొంతమంది భామలు బిగ్ సినిమాల్లో కూడా మంచి అవకాశాలు అందుకుంటున్నారు. ఒకప్పుడు ఛాన్స్ ల కోసం ఇబ్బంది పడిన బ్యూటీస్ ఇప్పుడు అందం, ఆకర్షణలో నార్త్ ఇండియన్ ముద్దుగుమ్మలతో పోటీ పడుతున్నారు. గ్లామర్ షోకి ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉండాలనే ఆలోచనకి వచ్చేశారు.

అందుకే ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ షో చేస్తూ దర్శక, నిర్మాతలకి తామున్నామని హింట్ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ ట్యాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ ప్రియాంక జువాల్కర్. ఈ అచ్చ తెలుగు అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. తరువాత సత్యదేవ్ కి జోడీగా తిమ్మరుసు సినిమాలో నటించింది.

ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో కిరణ్ సబ్బవరంతో జతకట్టింది. ఈ రెండు సినిమాలు పర్వాలేదనే టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ మూవీలో క్యామియో రోల్ లో మెరిసింది. ఈ బ్యూటీకి అందానికి అందం ఉంది, అలాగే నటిగా కూడా మంచి మార్కులు వేసుకుంది. సోషల్ మీడియాలో ప్రియాంక జువాల్కర్ తన కలర్ ఫుల్ గా తన గ్లామర్ షోతో కుర్రాళ్ళకి నిద్రలేని రాత్రులు మిగులుస్తుంది.

ఈ తెలుగమ్మాయికి స్టార్ హీరోయిన్ అయ్యే ఫీచర్స్ ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. అయితే సరైన ప్రాజెక్ట్ పడటం లేదు. అడపాదడపా అవకాశాలు మాత్రం సొంతం చేసుకుంటుంది. ఇతర భాషలలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ప్రియాంక జువాల్కర్ కి ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు.

అందుకే ఆమె పెట్టే ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ తెలుగు బొమ్మ ఇన్ స్టాగ్రామ్ తో అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ఫోటోషూట్ షేర్ చేసింది. స్లీవ్ లెస్ వైట్ బ్లౌజ్ ధరించి అందాలతో కనువిందు చేస్తోంది. చక్కనైన చిరునవ్వుతో పురివిప్పిన మయూఖంలా ప్రియాంక జువాల్కర్ ఈ కాస్ట్యూమ్ లో ఉందనే మాట వినిపిస్తోంది. ఈ ఫోటోలకి సంతోషంగా ఉన్న గులాబీ అంటూ ప్రియాంక క్యాప్షన్ ఇచ్చింది. నెటిజన్లు నుంచి ఫోటోలకి భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. రోజు రోజుకి ప్రియాంకా అందం పెరిగిపోతుందని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.