Begin typing your search above and press return to search.

పొట్టి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ..!

ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫోటో షూట్ చూసి ఫాలోవర్స్ అంతా వావ్ అనేస్తున్నారు. పొట్టి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ చేస్తుంది.

By:  Tupaki Desk   |   8 May 2024 1:12 PM GMT
పొట్టి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ..!
X

ప్రియాంక జైన్ బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మౌనరాగం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రియాంక జైన్ ఆ సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. పరిశ్రమలోకి వచ్చే ప్రతి అమ్మాయి కూడా హీరోయిన్ కావాలనే అనుకుంటుంది. ముందు సిల్వర్ స్క్రీన్ పై ప్రయత్నాలు చేశాకే అక్కడ వర్క్ అవుట్ అవ్వదని తెలిసి మరో దారి వెతుక్కుంటారు. ప్రియాంక జైన్ కూడా సిల్వర్ స్క్రీన్ పై తన లక్ టెస్ట్ చేసుకుంది. అమ్మడు 4 సినిమాల దాకా చేసింది. తెలుగులో 3 సినిమాలు చేసిన ప్రియాంక సినిమాల్లో కన్న సీరియల్స్ బెటర్ అని స్మాల్ స్క్రీన్ కు షిఫ్ట్ అయ్యింది.

ప్రియాంక జైన్ కన్నడ సినిమా చివరద నేనపుతో పరిచయమైంది. ఆ తర్వాత అక్కడే గోలీ సోడా సినిమా చేసింది. గోలీ సోడాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జైన్ తెలుగులో చల్తే చల్తే సినిమా ఆఫర్ అందుకుంది. ఆ సినిమాలో ఫిమేల్ లీడ్ గా చేసిన అమ్మడు వినరా సోదర వీర కుమారా లో ఛాన్స్ అందుకుంది. ఆ సినిమా టైం లోనే మౌనరాగం సీరియల్ ఆఫర్ అందుకుంది ప్రియాంక. ఆ సీరియల్ తో ప్రియాంక జైన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అసలు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆమె తెలుగు బుల్లితెర ఆడియన్స్ కు ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.

ఆ తర్వాత ఎవడు తక్కువ కాదు సినిమా చేసింది. ఇక మరోసారి బుల్లితెర మీద జానకి కలగనలేదు సీరియల్ తో మరోసారి మెప్పించింది. బుల్లితెర మీద అమ్మడి క్రేజ్ ని వాడుకునేందుకు బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ లో తనదైన శైలిలో అలరించిన ప్రియాంక జైన్ కంటెస్టెంట్స్ కి మంచి పోటీ ఇచ్చింది. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా పెంచుకున్న ప్రియాంక వారిని సాటిస్ఫై చేసేందుకు ఫోటో షూట్స్ చేస్తుంది.

ప్రియాంక జైన్ లేటెస్ట్ ఫోటో షూట్ చూసి ఫాలోవర్స్ అంతా వావ్ అనేస్తున్నారు. పొట్టి గౌనులో బిగ్ బాస్ బ్యూటీ రచ్చ చేస్తుంది. బార్బీ లా ఉండాలనుకునే డ్రీం లో నివసించాలని ఎవరు కోరుకోరంటూ ట్యాగ్ పెట్టి బార్బీ డ్రెస్ లో అదరగొట్టేస్తుంది ప్రియాంక. సీరియల్స్ ద్వారా హోంలీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంక తనలో మరో యాంగిల్ కూడా ఉంది అనేలా ఫోటో షూట్స్ చేస్తుంది. ప్రస్తుతం ప్రియాంక జైన్ ఈ పొట్టి గౌను ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియాంకని ఫాలో అవుతున్న వారంతా కూడా అమ్మడి ఫోటో షూట్ చూసి సర్ ప్రైజ్ అవుతున్నారు.