Begin typing your search above and press return to search.

వైరల్‌ : కడుపులో బేబీ కుర్చీ మడతపెట్టి...!

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.

By:  Tupaki Desk   |   27 April 2024 10:30 AM GMT
వైరల్‌ : కడుపులో బేబీ కుర్చీ మడతపెట్టి...!
X

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు మరియు యూనిట్‌ సభ్యులు అంతా కూడా వసూళ్ల విషయంలో చాలా నిరుత్సాహం వ్యక్తం చేశారు.

గుంటూరు కారం సినిమా వసూళ్ల విషయం వదిలేస్తే ఆ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంతటి వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అయిదు నెలలుగా ఆ పాట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. భాషతో సంబంధం లేకుండా ఎంతో మంది సోషల్‌ మీడియాలో కుర్చీ మడత పెట్టి రీల్స్ చేశారు.

ఇప్పుడు మరోసారి కుర్చీ మడత పెట్టి సాంగ్‌ వార్తల్లో నిలిచింది. సోషల్‌ మీడియాలో ఒక గర్భవతి చేసిన కామెంట్ వైరల్‌ అవుతోంది. తాను ఇప్పుడు ఆరు నెలల గర్భవతిని అని, తాను ఎప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్‌ పెట్టి వింటున్నా కూడా కడుపులో ఉన్న బేబీ కిక్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఆమె పోస్ట్‌ పెట్టింది.

సోషల్‌ మీడియాలో ఆ గర్భిణి పెట్టిన పోస్ట్‌ వైరల్‌ అవుతోంది. మహేష్ బాబు అభిమానులతో పాటు అందరూ కూడా ప్రస్తుతం ఈ కామెంట్‌ కు తెగ రియాక్ట్‌ అవుతున్నారు. ఆమెది ఎక్కడ అనే విషయాలను కొందరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే మరి కొందరు ఆమె చెప్పింది నిజమేనా అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మొత్తంగా కుర్చీ మడత పెట్టి సాంగ్‌ వింటున్న సమయంలో కడుపులో బేబీ తంతున్నట్లుగా అనిపిస్తుందని ఆమె చేసిన కామెంట్‌ చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల అయ్యి ఇన్ని రోజులు అయినా కూడా పాట గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఏ స్తాయిలో ఆ పాట విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయ్యింది. అయితే కుర్చీ మడత పెట్టి పాటలో శ్రీలీల చేసిన డాన్స్ కి నెటిజన్స్‌ తో పాటు అంతా ఫిదా అయ్యారు.

ఒక వైపు కుర్చీ మడత పెట్టి పాటను ట్రోల్స్ చేస్తూనే మరో వైపు జనాలు ఆ పాటను తెగ ఆధరిస్తూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో తాగుబోతు తాత మాట్లాడిన మాటల్లోంచి కుర్చీ మడత పెట్టి పదాలను తీసుకోవడం జరిగింది. పాట వచ్చిన కొత్తలో చాలా మంది విమర్శించారు. కానీ ఆ తర్వాత లక్షల మంది ఈ పాటకు రీల్స్ చేశారు.