Begin typing your search above and press return to search.

వింటేజ్ ప్రభాస్.. ఎన్నాళ్లయ్యిందో ఇలా చూసి

తాజాగా ఆయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వీడియోస్ బయటకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   18 April 2024 4:40 AM GMT
వింటేజ్ ప్రభాస్.. ఎన్నాళ్లయ్యిందో ఇలా చూసి
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ మోడ్ లో ఉన్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ లుక్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. సాహో సినిమాకే లుక్స్ పై చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. ఆదిపురుష్, సలార్ చిత్రాలలో ప్రభాస్ లుక్ పరంగా చాలా మందిని ఆకట్టుకోలేదు. పేస్ లో ఒకప్పటి కళ లేదని కామెంట్స్ వినిపించాయి.

ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్స్ అయితే ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయాయి. ఆయన ఇమేజ్ ని భరించలేని వారు దారుణంగా విమర్శలు చేశారు. హీరోలు తలుచుకుంటే ఆరు నెలల్లో తమ లుక్, బాడీ అన్ని మార్చేసుకుంటారు. సరైన ఫిట్ నెస్ ట్రైనర్ ని పెట్టుకొని పెర్ఫెక్ట్ గా రెడీ అవుతారు. ఇప్పుడు ప్రభాస్ కూడా సలార్ తర్వాత సినిమాలకి కొద్ది రోజులు విరామం ఇచ్చాడు. కాలికి సర్జరీ చేయించుకున్నాడు.

తాజాగా ఆయన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజాసాబ్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వీడియోస్ బయటకి వచ్చాయి. ఇందులో ప్రభాస్ లుక్ ఈ మధ్యకాలంలో కనిపించిన వాటితో పోల్చుకుంటే కంప్లీట్ డిఫరెంట్ గా అనిపించింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ వీడియోలో ప్రభాస్ వింటేజ్ స్టైల్ లో కనిపించాడు.

మిర్చి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు సినిమాలలో మ్యాన్లీగా ఎంత పెర్ఫెక్ట్ గా ఉండేవాడో అదే లుక్ లో కనిపించి కనువిందు చేశాడు. ఈ లుక్ కి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ప్రభాస్ అభిమానులు షేర్ చేసుకుంటూ వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ లుక్స్ పరంగా చాలా చేంజ్ కనిపిస్తుందని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.

ఇదే లుక్ లో రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలు రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. అలాగే ఇలా స్లిమ్ అండ్ పెర్ఫెక్ట్ గా మ్యాన్లీ లుక్ ని లేడి ఫ్యాన్స్ కూడా బాగా ఇష్టపడతారు. ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ తీసుకొచ్చింది కూడా ఈ వింటేజ్ మ్యాన్లీ లుక్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ అలాంటి లుక్ లో ప్రభాస్ కనిపించేసరికి వీడియో తెగ ట్రెండ్ అవుతోంది.