Begin typing your search above and press return to search.

ప్రభాస్ న్యూలుక్.. ఇది నిజమేనా డార్లింగ్

స్లిమ్ అయ్యి లాంగ్ హెయిర్ తో, గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ లుక్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   24 April 2024 4:18 AM GMT
ప్రభాస్ న్యూలుక్.. ఇది నిజమేనా డార్లింగ్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే కల్కి 2898ఏడీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతోంది. మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ కోసం ప్రస్తుతం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ప్రభాస్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఈ మధ్యనే ఫారిన్ నుంచి వచ్చిన తర్వాత వింటేజ్ ప్రభాస్ ని గుర్తు చేసేలా అతని లుక్ ఉంది.

స్లిమ్ అయ్యి లాంగ్ హెయిర్ తో, గడ్డంతో కనిపిస్తున్నాడు. ఈ లుక్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రాజాసాబ్ మూవీ కోసమే ప్రభాస్ ప్రత్యేకంగా ఈ లుక్ లోకి మారినట్లు టాక్ వినిపిస్తోంది. సలార్ సినిమాలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, లుక్ పరంగా విమర్శలు వచ్చాయి. దీంతో మరల వర్క్ అవుట్ చేసి తన మునుపటి లుక్ లోకి ప్రభాస్ వచ్చేసినట్లు సమాచారం..

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కి సంబందించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ హెయిర్, పిల్లిగడ్డంతో డిఫరెంట్ షెడ్ లో ప్రభాస్ ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. అయితే ఇది నేచురల్ ఫోటోనా లేదంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. రాజాసాబ్ లో ఈ కొత్త లుక్ లో ప్రభాస్ కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది.

ప్రభాస్ ఫారిన్ నుంచి వచ్చాక అక్కడక్కడ ఫోటోలకి చిక్కుతున్నాడు తప్ప మీడియా ముందుకి పూర్తిస్థాయిలో రాలేదు. త్వరలో కల్కి 2898ఏడీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ కానుంది. తరువాత మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ కచ్చితంగా పాల్గొంటాడు. అప్పుడు అతని ఒరిజినల్ లుక్ పూర్తిగా బయటపడే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇక కల్కి 2898ఏడీ మూవీని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో స్థాయిలో ఎలివేషన్ ఉండబోతోందని తాజాగా వచ్చిన అశ్వద్ధామ క్యారెక్టర్ టీజర్ చెబుతోంది. కల్కి అవతారంలో ప్రభాస్ కి నాగ్ అశ్విన్ ఏ స్థాయిలో ఎలివేషన్ ఇచ్చాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఇక త్వరలోనే సినిమాలోని సాంగ్ రిలీజ్ కాబోతోంది.