Begin typing your search above and press return to search.

లుక్ ఓకే.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే చాలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 April 2024 3:00 AM GMT
లుక్ ఓకే.. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటే చాలు!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్.. భైరవ పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే పద్మావతి రోల్ లో దీపిక, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రభాస్.. మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ మూవీ కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు టాక్.

అయితే ఇటీవల రాజా సాబ్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగుపెట్టినట్టు ఓ వీడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అందులో డార్లింగ్ కొత్త లుక్ లో కనిపించారు. ఆ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వైరల్ చేశారు. మిర్చి సినిమా టైమ్ లోలాగా స్టైలిష్‌ గా ఉన్నారంటూ రచ్చ రచ్చ చేశారు. స్లిమ్ గా కటౌట్ అదిరిపోయిందని పోస్టులు పెట్టారు. నయా అవతార్ లో ప్రభాస్ ను చూసి ఫుల్ ఖుషీ అయిపోయారు. వింటేజ్ లుక్ సూపర్ అని సందడి చేశారు.

ఇప్పుడు వైరల్ అయిన ఆ వీడియోతో డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రభాస్ లుక్ పై ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ఛార్మింగ్ గా తన సినిమాలో కనిపించనున్నట్లు వీడియో ద్వారా తెలిపారు. ఫ్యాన్స్ లో కావాల్సిన జోష్ నింపారు. కల్కి సినిమాకు గాను ప్రభాస్ లుక్ విషయంలో ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ అనుమానాలను క్లియర్ చేశారు. గత ఏడాది సలార్ లో కంప్లీట్ రగ్డ్ లుక్ లో డార్లింగ్ కనిపించగా.. ఆయన ఫ్యాన్స్ లో కొందరు సాటిస్ఫై అవ్వలేదు.

ఇప్పుడు మాత్రం ఈ లుక్ అందరికీ నచ్చేసింది. ఈ బాడీతో సినిమా వస్తే కచ్చితంగా అదిరిపోతుందని అభిమానులు అంటున్నారు. కాబట్టి నాగ్ అశ్విన్.. లుక్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ సాటిస్ఫై చేసినట్లే. సినిమాను కూడా సరైన విధంగా తెరకెక్కిస్తే సూపర్ హిట్టే. మరి కల్కి 2898 ఏడీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ సాధిస్తుందో వేచి చూడాలి.