Begin typing your search above and press return to search.

బ‌న్నీ విల‌న్ రాంగోపాల్ వ‌ర్మ‌లా ఉన్నాడే!

ఎంతో కాలంగా మాలీవుడ్ లో పేరున్న న‌టుడిగా రాణిస్తున్నా! తెలుగులో మాత్రం సినిమాలు చేయ‌లేదు.

By:  Tupaki Desk   |   25 April 2024 7:06 AM GMT
బ‌న్నీ విల‌న్  రాంగోపాల్ వ‌ర్మ‌లా ఉన్నాడే!
X

మాలీవుడ్ ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ ఫ‌హాద్ ఫాసిల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సుకుమార్ పుణ్య‌మా అని ఫ‌హాద్ టాలీవుడ్ కి ప‌రిచ‌మ‌య్యాడు. ఎంతో కాలంగా మాలీవుడ్ లో పేరున్న న‌టుడిగా రాణిస్తున్నా! తెలుగులో మాత్రం సినిమాలు చేయ‌లేదు. తొలిసారి సుకుమార్ పుష్ప కోసం తీసుకురావ‌డంతో అత‌ను ట్యాలెంట్ ఇక్క‌డ జ‌నాల‌కి తెలిసింది. సుకుమార్ ఎంపిక చేసిన పాత్ర‌కు అత‌ను మాత్ర‌మే న్యాయం చేయ‌గ‌ల‌డ‌ని రిలీజ్ అనంత‌రం ప్రేక్ష‌కులు జేజేలు కొట్టారు. అటుపై 'విక్ర‌మ్' సినిమాతో మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఇటీవ‌లే `ఆవేశం` అనే సినిమాతో సోలో హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల‌కు పైగా వ‌సూళ్లును సాధించింది. అయితే ఫ‌హాద్ మీడియాకి పెద్ద‌గా ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌రు. ఆయ‌న‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యం ఎంతో గోప్యంగా ఉంటుంది. అందులోనూ కుటుంబానికి సంబంధించిన విష‌యాలైతే అస్సలు తెలియ‌న‌వ్వ‌రు. అలాంటి న‌టుడు తొలిసారి ఓ ప్రముఖ సినీ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ క్లిప్పింగ్ ఒక‌టిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో మ‌రోసారి ఫ‌హాద్ త‌న సినిమాల గురించి తన భార్య, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడా మాట్లాడనని మ‌రోసారి ఉద్ఘాటించారు.

సినిమాల గురించి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అలా మాట్లాడ‌టం కంటే కంటే సినిమా చేయడమే నాకు ఇష్టమన్నారు. అలాగే త‌న సినిమాలు చూడ‌మ‌ని ప్రేక్ష‌కుల్ని బ‌ల‌వంతం చేయ‌న‌ని...న‌చ్చితే చూస్తారు..లేక‌పోతే లేదు. వాళ్ల‌ను చూడ‌మనే హ‌క్కు మ‌న‌కి లేద‌న్నా`రు. ఈ ఇంట‌ర్వ్యూ ఓ సెక్షన్ ఆడియ‌న్స్ కి బాగా క‌నెక్ట్ అయింది. వ్య‌క్తిగ‌తంగా అత‌ని వ్య‌క్తిత్వాన్ని ఇష్ట‌ప‌డుతున్నారు. అత‌ని స‌మాధానాలు రొటీన్ కి భిన్నంగా ఉన్నాయ‌ని సినిమాని-వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఆయ‌న వేరు చేసిన విధానం అంద‌రికీ న‌చ్చుతుంది. ఆయ‌న‌లో వ‌ర్మ ల‌క్ష‌ణాలున్నాయంటూ కొంద‌రు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఫ‌హాద్ వైఫ్ హీరోయిన్ అన్న సంగ‌తి తెలిసిందే. న‌జ్రియా న‌జీమ్ -ప‌హాద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఫ‌హాద్ ఫాస‌ల్ పుష్ప‌-2 లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రెండ‌వ భాగంలో పుష్ప‌రాజ్- షెకావ‌త్ పాత్ర‌ల మ‌ధ్య నువ్వా? నేనా? అన్న రేంజ్ లో క‌థ న‌డుస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.