Begin typing your search above and press return to search.

నితిన్ తమ్ముడు.. యాక్షన్ కోసం గట్టిగానే..

ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   24 April 2024 1:19 PM GMT
నితిన్ తమ్ముడు.. యాక్షన్ కోసం గట్టిగానే..
X

ఎనర్జిటిక్ హీరో నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం సిద్ధం అవుతోంది. మరో వైపు దిల్ రాజు ప్రొడక్షన్ లో నితిన్ తమ్ముడు టైటిల్ తో మూవీ చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మూవీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ నితిన్ అక్కగా నటిస్తోంది.

ఆమె పాత్రకి సినిమాలో మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు అద్భుతమైన సిస్టర్ సెంటిమెంట్ కూడా సినిమాలో ఉంటుందంట. నితిన్ కెరియర్ లో తమ్ముడు ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. కాంతారా, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. అలాగే గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి మూవీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని కీలక సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా న్యూ షెడ్యూల్ తాజాగా రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ చేశారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని 10 రోజుల పాటు ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూట్ చేస్తున్నారంట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యాక్షన్ ఎపిసోడ్ లో మొత్తం 50 మంది ఫైటర్స్ పాల్గొంటారంట. వారందరితో సుదీర్ఘంగా ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే పెర్ఫెక్షన్ కోసం ఏకంగా 10 రోజులు ఈ ఎపిసోడ్ ని వేణు శ్రీరామ్ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందనే మాట చిత్ర యూనిట్ నుంచి వినిపిస్తోంది. నితిన్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

వకీల్ సాబ్ మూవీ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో మరోసారి వేణు శ్రీరామ్ ఈ సినిమా చేయబోతున్నాడు. అలాగే దిల్ తో దిల్ రాజుకి కెరియర్ లో బెస్ట్ మూవీ ఇచ్చిన నితిన్ తరువాత సీతారాముల కళ్యాణం మూవీతో ఫ్లాప్ అందుకున్నారు. మూడో ప్రయత్నంగా దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతోంది. మూవీ ఫస్ట్ లుక్ తోనే తమ్ముడు చిత్రంపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతోంది. మరి పవన్ కళ్యాణ్ కి సూపర్ హిట్ ఇచ్చిన ఈ టైటిల్ అతని ఫ్యాన్ బాయ్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.