Begin typing your search above and press return to search.

అల్లు కాంపౌండ్ లో కొత్త కారు ఎవ‌రి కోసమో!

ఏ కారులో బ‌య‌ట‌కి వెళ్లాల‌న‌కుంటే ఆ కారులో ఎంచ‌క్కా తిరిగొస్తారు.

By:  Tupaki Desk   |   26 April 2024 12:16 PM GMT
అల్లు కాంపౌండ్ లో  కొత్త కారు ఎవ‌రి కోసమో!
X

సెల‌బ్రిటీల ఇంట బ్రాండెండ్ కార్లు త‌ప్ప‌నిస‌రి. మార్కెట్ లోకి ఏ బ్రాండ్ కారొచ్చినా దానంతు చూడాల్సిందేన‌న్న‌ది కొంత మంది నైజం. కార్లంటే అమితంగా ఇష్ట‌ప‌డే వారు క‌చ్చితంగా ఇలాగే ఆలోచిస్తారు. అందులో అల్లు అర‌వింద్ కూడా ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇప్ప‌టికే ఆయ‌న ఇంట ఎన్నో ఖ‌రీదైన లగ్జ‌రీ కార్లు ఉన్నాయి. ఒక్కొక్క‌రికి రెండేసి కార్లు ఉన్నాయి. ఏ కారులో బ‌య‌ట‌కి వెళ్లాల‌న‌కుంటే ఆ కారులో ఎంచ‌క్కా తిరిగొస్తారు. తాజాగా అల్లు వారి లోగిళ్ల‌లో మ‌రో న్యూ బ్రాండ్ కారు వెల‌సింది.

BMW i7 కారును కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదెన్నో పీచ‌ర్ల‌ను క‌లిగి ఉండ‌టంతో అర‌వింద్ ఇష్ట‌ప‌డి కొన్న‌ట్లు తెలుస్తోంది. దీని ధ‌ర అక్ష‌రాలు రూ. 1.95 కోట్లు .(ఎక్స్-షోరూమ్ ధ‌ర ఇది) . ఆ కారు ఈరోజు ఇంటికి డెలివరీ అయింది. i7 అనేది BMW నుండి ఎలైట్ సెగ్మెంట్ ఈవీ కారు. ఈ సెగ్మెంట్‌లోని కొన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. తాజాగా ఆ కారుతో అర‌వింద్ ఇంటి ముందు ఉండ‌టం చూడొచ్చు. నిర్మాత ఈ కొత్త కారుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

రేప‌టి నుంచి అర‌వింద్ గారు ఇదే కారులో హైద‌రాబాద్ సిటీలో ఎంచక్కా తిరిగేస్తారు. ఆ కారు స‌ర‌దా తీరే వ‌ర‌కూ సినిమా ఈవెంట్ల‌కు ఇదే కారులో హాజ‌ర‌వుతారు. అన్న‌ట్లు ఈ కారు త‌న కోసం కొన్న‌దా? లేక శిరీష్ కోసమా? అన్న‌ది డౌటే నండోయ్. శిరీష్ ఇంకా త‌ల్లిదండ్రుల‌తోనే ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ కి వివాహం అవ్వ‌డంతో వేరుగా ఉంటున్నాడు. కానీ శ‌రీష్ ఇంకా సింగిల్ గానే ఉంటున్నాడు. సినిమాలు కూడా పెద్ద‌గా చేయ‌డం లేదు. స‌రైన క‌థ‌లు కుద‌ర‌క‌పోవ‌డంతో! ఖాళీగానే ఉంటున్నాడు.

మ‌రి ఈ కారు శిరీష్ కోసం డాడ్ తెచ్చిన గిప్ట్ అవుతుందా? లేక పెద్దాయ‌న సొంత కొస‌మా? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే అర‌వింద్ ఇంట ఎన్నో కార్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అర‌వింద్ గీతా ఆర్స్ట్ లో ప‌లు సినిమాలు నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో కూడా మ‌ళ్లీ నిర్మాత‌గా స్పీడ్ పెంచుతున్నారు. ఈ రెండేళ్ల‌లో రెండు సినిమాలు అక్క‌డా నిర్మించిన సంగ‌తి తెలిసిందే.