Begin typing your search above and press return to search.

ఈ సారి నారా రోహిత్ 'సుందరకాండ'

తాజాగా నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు మేకర్స్.

By:  Tupaki Desk   |   17 April 2024 12:36 PM GMT
ఈ సారి నారా రోహిత్ సుందరకాండ
X

నారా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక హీరో నారా రోహిత్.. సినిమాల విషయంలో మళ్లీ స్పీడ్ పెంచారు. 2018లో బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో అలరించిన ఆయన.. ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ ఆరేళ్ల తర్వాత ప్రతినిధి-2 మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం వచ్చిన ప్రతినిధికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా.. త్వరలో విడుదల కానుంది.

తాజాగా నారా రోహిత్ ల్యాండ్ మార్క్ 20వ మూవీ అనౌన్స్మెంట్ వచ్చింది. టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించేశారు మేకర్స్. సుందరకాండ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం నారా రోహిత్.. వెంకటేష్ నిమ్మలపూడితో చేతులు కలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేశారు మేకర్స్. టైటిల్ గ్లింప్స్ తో పాటు నారా రోహిత్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

పోస్టర్ లో కూల్ అండ్ క్లాసీగా ఒక చేతిలో కుండతో, మరో చేతిలో పుస్తకంతో కనిపిస్తున్నారు నారా రోహిత్. ఇక టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. "ప్రేమ.. ఇది అందరి లైఫ్ లో కామన్ గా జరిగేదే.. అమ్మ అన్నం పెట్టినా.. ఫ్రెండ్ బూతులు తిట్టినా.. ఒక్క అమ్మాయిని చూసిన వెంటనే నచ్చినా.. అదే అమ్మాయి బ్రేకప్ చెప్పినప్పుడు ఏడ్చినా.. అన్నిట్లో ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రేమ కథ కచ్చితంగా ఉంటుంది"

"కొన్ని మణిరత్నం గీతాంజలిలా సాడ్ ఎండింగ్ అవ్వవచ్చు. మురారిలో మహేష్ బాబులా ఫేట్ తో ఫైట్ చేయొచ్చు.. గౌతమ్ మీనన్ ఏ మాయ చేశావేలా ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు.. బొమ్మరిల్లులో సిద్ధులా పేరెంట్స్ చేతిలో డిసెషన్ పెట్టొచ్చు.. ఖుషిలో పవన్ కళ్యాణ్ లా మనస్పర్థలు రావచ్చు.. ఆర్యలో అల్లు అర్జున్ లా వన్ సైడ్ లవ్ అవ్వవచ్చు. ఇలా ఎన్ని ఉన్నా.. ఏ రెండు ప్రేమ కథలు ఒకలా ఉండవు. అందుకే ప్రతి కథలో తెలియని మ్యాజిక్ ఉంటుంది. అలాంటి మ్యాజిక్ నా లైఫ్ లో కూడా జరిగింది" అంటూ బ్యాక్ గ్రౌండ్ లో హీరో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

మంచి లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమాను సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వ్రితి వాఘని హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీదేవి విజయ్ కుమార్, నరేష్ విజయ కృష్ణ, వాసుకీ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 6న ఈ మూవీ విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నారా రోహిత్ ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.