Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్ ట్యాలెంట్ కి ప‌డిపోయిన సీత‌మ్మ‌!

బాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఆ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 April 2024 6:59 AM GMT
ఆ డైరెక్ట‌ర్ ట్యాలెంట్ కి ప‌డిపోయిన సీత‌మ్మ‌!
X

`ప‌ద ప‌ద మందే నా అడుగే నీ వైపు.. అటు ఇటు చూడ‌కు అంటోంది నా చూపు..నా మ‌ది కూడా ఎపుడో జారిందే` ..అది ప్రేమో! ఏమో తెలిసేలోపు! నే ప‌డిపోయా నే ప‌డిపోయా` అంటూ సాగే పాట ఏసుకోవాల్సిందే ఈ బ్యూటీ మైకం చూస్తుంటే! `డైమండ్ బజార్‌లో అద్భుతమైన సాయంత్రం గడిపాను! సార్ మీరు అందమైన - మాయా ప్రపంచాన్ని సృష్టించారు. ఆ ప్రపంచం దానిని అనుభవించడానికి నేను వేచి ఉండలేను` అంటూ మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్నాలీని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టింది.


ప్ర‌స్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆ డైరెక్ట‌ర్ ట్యాలెంట్ కి సీత‌మ్మ ఎంత‌గా ఫిదా అయిపోతుందో? ఆమె పోస్ట్ ని బట్టే చెప్పొచ్చు. ప్ర‌స్తుతం సంజ‌య్ లీలా భ‌న్సాలీ హీరామండి అనే నెట్ ప్లిక్స్ సిరీస్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆసిరీస్ నుంచి ప‌రిచ‌యం చేసిన ఒక్కో పాత్ర ఓ వండ‌ర్ లా అనిపించింది. మ‌రోసారి క‌ళాత్మక చిత్రాల ద‌ర్శ‌కుడు అంటే ఎలా ఉంటాడో? ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ డిజైన్స్ తోనే ప్రూవ్ చేసారు. అందుకోసం అద్భుత‌మైన సెట్లు నిర్మించ‌డం...క‌నీసం క‌ల‌లోకి కూడా రాని అంద‌మైన ప్ర‌పంచాన్ని ఎంతో అద్బుతంగా సృష్టించారు.


బాలీవుడ్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. ఆ సిరీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అ సెట్ ని విజిట్ చేసిన అనంతరం మృణాల్ త‌న మ‌న‌సులో భావాల్ని పైవిధంగా బ‌య‌ట పెట్టింది. అలాగే స్పాట్ నుంచి ఓ సెల్పీ కూడా పోస్ట్ చేసింది. ఇందులో త‌న‌దైన క్రియేటివిటీ వాడింది. క్లోజ‌ప్ షాట్ లో అమ్మ‌డు దిగిన ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి `హీరామండి`లో మృణాల్ కూడా క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేస్తుందా? అన్న సందేహం నెటి జ‌నుల‌కి వ‌చ్చేస్తోంది.


ఆమె న‌టిస్తున్న‌ట్లు ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న లేదు. మ‌రి అమ్మ‌డితో సంజ‌య్ ఏదైనా గెస్ట్ రోల్ ఆఫ‌ర్ ఇచ్చారా? అన్న‌ది చూడాలి. ఒక‌వేళ ఇప్పుడు కాక‌పోయినా మృణాల్ ట్యాలెంట్ ని మెచ్చి సంజ‌య్ అవ‌కాశం ఇస్తాడు? అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు మ‌రోసారి సీత‌మ్మ స‌త్తా చాటేస్తుంది. మే 1న `హీరామండి` సీరిస్ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాలు వేగంగా జ‌రుగుతున్నాయి.