Begin typing your search above and press return to search.

బంధాలు క‌ఠినంగా మారాయి.. అండాల‌ను ఫ్రీజ్ చేయిస్తాను: మృణాల్

మ‌నుషుల మ‌ధ్య బంధాలు కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే మ‌న ఉద్యోగ స్వభావాన్ని అర్థం చేసుకునే సరైన భాగస్వామిని వెతకాలి`` అని అన్నారు.

By:  Tupaki Desk   |   25 April 2024 5:22 PM GMT
బంధాలు క‌ఠినంగా మారాయి.. అండాల‌ను ఫ్రీజ్ చేయిస్తాను: మృణాల్
X

ఓవైపు సినిమాలు మ‌రోవైపు ఓటీటీ సిరీస్ ల‌తో పదే పదే నిరూపించుకున్న మృణాల్ ఠాకూర్ ఇటీవల జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వృత్తిగ‌త జీవితానికి వ్య‌క్తిగ‌త‌ జీవితానికి మధ్య సమతుల్యతను కాపాడుకోవ‌డం గురించి మాట్లాడారు. జీవితాన్ని వృత్తిని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మ‌నం ఎల్లప్పుడూ ఆ సమతుల్యతను ఎలా సాధించాలో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. మ‌నుషుల మ‌ధ్య బంధాలు కఠినంగా ఉంటాయని నాకు తెలుసు. అందుకే మ‌న ఉద్యోగ స్వభావాన్ని అర్థం చేసుకునే సరైన భాగస్వామిని వెతకాలి`` అని అన్నారు.

నటి మోనా సింగ్ లాగా అండాలను ఫ్రీజ్ చేసి దాచి ఉంచుతారా? అని ప్ర‌శ్నించ‌గా.. మృణాల్ ఠాకూర్ ఇలా అన్నారు.. ``ఫ్రీజింగ్ ఎగ్స్ (అండాలు)... అవును .. నేను కూడా దానిని పరిశీలిస్తున్నాను`` అని అన్నారు. తాను థెరపీపై ఆధార‌ప‌డ‌తాని, ప్రియ‌మైన వారి కోసం చాలా చేస్తాన‌ని కూడా మృణాల్ అన్నారు. నేను నాలో నేను సర్దుకుని ఇంటికి వెళ్ళినపుడు నేను దయనీయంగా ఉన్నాను. అన్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి థెరపీలు చేయిస్తాను. ఇది ఎవరికైనా ముఖ్యం.. ముఖ్యంగా విభిన్న పాత్రలు పోషించే నటులకు ఇది అవ‌స‌రం. నన్ను నిలదీసే వ్యక్తుల్లో నా స్నేహితులు.. నా సోదరి కూడా ఉన్నారు... అని తెలిపారు.

సీతా రామం, సూపర్ 30, తూఫాన్, బాట్లా హౌస్, లవ్ సోనియా, ఘోస్ట్ స్టోరీస్ స‌హా ప‌లు చిత్రాల్లో త‌న న‌ట‌న‌కు అద్భుత ప్ర‌శంస‌లు కురిసాయి. కార్తిక్ ఆర్యన్‌తో ధమాకా.. షాహిద్ కపూర్‌తో జెర్సీలోను న‌టించింది. మృణాల్ ఠాకూర్ చివరిగా విజయ్ దేవరకొండతో కలిసి `ఫ్యామిలీ స్టార్` చిత్రంలో కనిపించింది. గతంలో నాని సరసన హాయ్ నాన్నా సినిమాలో నటించింది. త‌దుప‌రి `పూజా మేరీ జాన్‌` అనే చిత్రంలో నటించనుంది.