Begin typing your search above and press return to search.

మోక్షజ్ఞ ఎంట్రీ.. వెయిటింగ్ తప్పదా..?

బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఫ్యాన్స్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   25 April 2024 6:00 AM GMT
మోక్షజ్ఞ ఎంట్రీ.. వెయిటింగ్ తప్పదా..?
X

నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో లెజెండ్ టైం లోనే మోక్షజ్ఞ క్యామియో ఉంటుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కు ఆ సినిమా నిరాశపరచగా ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చినా ఎందులోనూ మోక్షజ్ఞ కనిపించలేదు. నందమూరి వారసుడి ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వచ్చినా వాటిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. బాలయ్య బాబు తీసే ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కొందరు అంటుంటే బోయపాటి శ్రీను డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని కొందరు చెబుతున్నారు.

బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే ఫ్యాన్స్ లోనే కాదు ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా ఉంటాయి. బాలకృష్ణ ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ ఫాం ఆయనతో బోయపాటి చేసిన సింహా నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఇదే పంథాలో మోక్షజ్ఞ కూడా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సినిమా చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ తెరంగేట్రానికి సంబంధించిన కథ రెడీ చేసినట్టు టాక్.

ప్రస్తుతం బోయపాటి శ్రీను తన తర్వాత సినిమా బాలకృష్ణతోనే చేయనున్నారు. అఖండ 2 ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెట్స్ మీదకు వెళ్లబోతుంది. మరి అఖండ 2 లో ఏదైనా మోక్షజ్ఞ క్యామియో ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఇంకా వెయిటింగ్ తప్పేలా లేదంటూ పరిస్థితి కనిపిస్తుంది.

అఖండ 2 లో మోక్షజ్ఞ లేకపోతే డైరెక్ట్ గా సోలో సినిమాతోనే మోక్షజ్ఞ ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది. నందమూరి ఫ్యాన్స్ మాత్రం మోక్షజ్ఞ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొన్నాళ్లు క్రిష్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ సినిమా ఉంటుందని హడావిడి చేశారు. ఇప్పుడు బోయపాటితోనే మోక్షజ్ఞ ఎంట్రీ అంటుంటారు. డైరెక్టర్స్ లిస్ట్ పెరుగుతుంది కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగట్లేదు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడం కోసమే మోక్షజ్ఞ ఫారిన్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. నందమూరి నట వారసుడిగా మోక్షజ్ఞ మీద ఉన్న అంచనాలు తెలిసిందే. మరి ఆ ఎక్స్ పెక్టేషన్స్ ను మోక్షజ్ఞ నిజం చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా సరే నందమూరి మోక్షజ్ఞ తాత తండ్రి లెగసీని కొనసాగిస్తాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.