Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇచ్చిన కారు ఇంకా ఇంట్లోనే!

కాలక్ర‌మంలో తెలుగు ద‌ర్శ‌కుడు బాలీవుడ్ విల‌న్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో స‌త్య‌ప్ర‌కాష్ లాంటి సీనియ‌ర్ల‌కు అవ‌కాశాలు త‌గ్గాయి.

By:  Tupaki Desk   |   25 April 2024 3:30 PM GMT
మెగాస్టార్ ఇచ్చిన కారు ఇంకా ఇంట్లోనే!
X

సీనియ‌ర్ న‌టుడు స‌త్యప్రకాశ్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్ర‌తి నాయ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును క‌లిగిన న‌టుడు. పోలీస్ స్టోరీ లాంటి సినిమా స‌త్య‌ప్ర‌కాష కి ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తీసుకొచ్చింది. దాదాపు మూడు ద‌శాబ్ధాలుగా తెలుగు ప‌రిశ్ర‌మ‌కి సేవ‌లందిస్తున్నారు. `జైత్ర‌యాత్ర‌`తో న‌టుడిగా ప‌రిచ‌య‌మైన ఆయ‌న ఎన్నో సినిమాల్లో న‌టించారు. కాలక్ర‌మంలో తెలుగు ద‌ర్శ‌కుడు బాలీవుడ్ విల‌న్ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో స‌త్య‌ప్ర‌కాష్ లాంటి సీనియ‌ర్ల‌కు అవ‌కాశాలు త‌గ్గాయి.

కానీ అవ‌కాశం ఇస్తే వాళ్ల‌ను మించిన గొప్ప న‌టుడని ఎప్పుడో ప్రూవ్ చేసాడు. అవ‌కాశిలిస్తే ఇప్పుడు స‌త్తా చాట‌గ‌ల నటుడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవితో త‌న‌కున్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. `నేను పుట్టింది విజయనగరంలో . తొలి నుంచి నేను చిరంజీవి గారికి అభిమానిని. ఆయ‌న‌తో క‌లిసి మొద‌టిసారి బిగ్ బాస్ సినిమాలో చేసాను. ఆ సినిమా సెట్లోనే నాకు నేనుగా చిరంజీవిగారిని పరిచయం చేసుకున్నాను. వారం రోజుల పాటు షూటింగులో పాల్గొన్నాను. చిరంజీవిగారి కాంబినేషన్లో ఫైట్స్ చేసేటప్పుడు, నా విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త తీసుకునేవారు.

నాకు దెబ్బలు తగలకుండా ఆయన కేర్ తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నేను షూటింగ్ పాత స్కూట‌ర్ పై రావ‌డం, వెళ్ల‌డం చూసేవారు. ఆ స‌మ‌యంలోనే హెల్మెట్ లేకుండా స్కూటర్ నడపడం ప్రమాదమని హెచ్చరించారు. అప్పుడే నాకు కారు కొనిపెడతానని అన్నారు. అన్న‌ట్లుగానే మారుతి కారు కొనిచ్చారు. ఆ తరువాత చాలా కార్లు మార్చానుగానీ, మెగాస్టార్ ఇచ్చిన కారు ఇప్పటికీ అలాగే ఉంది. ఆ జ్ఞాప‌కం ఎప్ప‌టికీ చెరిగిపోనిది` అని అన్నారు.

స‌త్య ప్ర‌కాష్ గ‌త ఏడాది రిలీజ్ అయిన మ‌సూద‌లో కీల‌క పాత్ర‌లో మెప్పించారు. ఆ సినిమా మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే అదే ఏడాది భారీ తారాగ‌ణం అనే మ‌రో సినిమాలోనూ న‌టించాడు. ప్ర‌స్తుతం చేతిలో కొత్త అవకాశాలైతే లేవు. స‌త్య‌ప్ర‌కాష్ చిరుతోనే కాదు బాల‌కృష్ణ‌..నాగార్జున‌..వెంక‌టేష్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో విల‌న్ గా...కీల‌క పాత్ర‌లు పోషించిన చిత్రాలెన్నో ఉన్నాయి.