Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మి కోరిక.. ఎప్పుడు తీరుతుందో?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

By:  Tupaki Desk   |   26 April 2024 2:30 PM GMT
మంచు లక్ష్మి కోరిక.. ఎప్పుడు తీరుతుందో?
X

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు డాటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద వరుస చిత్రాలు చేస్తూ సందడి చేస్తోంది. తండ్రి చూపిన సినీ బాటలోనే నడుస్తోంది. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా వెబ్ సిరీసుల్లో కూడా యాక్ట్ చేస్తోంది. తన అందం, అభినయంతో సినీ ప్రియులను అలరిస్తోంది.


ఇటీవల హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మార్చింది మంచు లక్ష్మి. బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైకి షిఫ్ట్ అయింది. బాలీవుడ్ లో ఆడిషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు కూడా ఆ మధ్య తెలిపింది. కెరీర్ ను కొత్తగా ప్రారంభించాలని నార్త్ కు వెళ్లినట్లు చెప్పింది. ఇక ముంబై వెళ్లాక మంచు లక్ష్మి ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతోంది. ఆమె పిక్స్ ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

తాజాగా మంచు లక్ష్మి నార్త్ సెలబ్రిటీలు విక్రాంత్ మాస్సే, దిల్జిత్ దోశాంజ్ తో పాటు ప్రతీక్ గాంధీలపై ప్రశంసల వర్షం కురిపించింది. ఛాన్స్ వస్తే ముగ్గురితో యాక్ట్ చేయాలని ఉన్న తన మనసులోని కోరికను బయట పెట్టింది. తాను ఎప్పుడూ తను మనసును హత్తుకునే సినిమాల పట్ల సంతోషిస్తానని చెప్పింది. '12th ఫెయిల్' మూవీలో విక్రాంత్ మాస్సే యాక్టింగ్ అదరగొట్టేశారని కొనియాడింది. ఆయన నటన అన్బిలీవబుల్ అని చెప్పింది.

గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీకి తాను పెద్ద అభిమానినని తెలిపింది మంచు లక్ష్మి. చమ్కిలా సినిమా చూశానని, వావ్ అనేలా ఉందని చెప్పింది. తాను మ్యూజీషియన్ దిల్జిత్ దోసాంజ్‌ కు కూడా ఫ్యాన్ అని, వీరి ముగ్గురితో కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. కొన్ని రోజులుగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్న మంచు డాటర్.. ప్రస్తుతం ఆదిపర్వం మూవీలో నటిస్తోంది. ఈ సినిమా గురించి కూడా మాట్లాడింది లక్ష్మి.

'అగ్ని నక్షత్రం' సినిమా అద్భుతంగా ఉంటుందని, తొలిసారి నాన్నతో కలిసి నన్ను ఆడియన్స్ చూడనున్నారని తెలిపింది. అందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొంది. 'అగ్ని నక్షత్రం' తర్వాత తాను నటించిన మరిన్ని ప్రాజెక్టులు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. తన అప్ కమింగ్ ప్రాజెక్టుల్లో మూడు తెలుగు సినిమాలు, ఓ కోలీవుడ్ మూవీ ఉన్నట్లు చెప్పింది. మరి మంచు లక్ష్మి కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.