Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : మహేష్‌ వెంట ఉన్న ఈ బ్యూటీ ఎవరు?

తాజాగా మరోసారి మహేష్ బాబు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి నటి నీరూ సెహగల్ తో ఉన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి

By:  Tupaki Desk   |   24 April 2024 4:30 PM GMT
పిక్ టాక్ : మహేష్‌ వెంట ఉన్న ఈ బ్యూటీ ఎవరు?
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఫోటోలు ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతూ ఉన్నాయి. ఇటీవల రాజమౌళితో కలిసి ప్రయాణిస్తున్న మహేష్‌ బాబు లుక్ ను చూసి అంతా కూడా షాక్ అవుతున్నారు. బాబోయ్‌ మరీ ఈ స్థాయి మార్పు ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

తాజాగా మరోసారి మహేష్ బాబు ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈసారి నటి నీరూ సెహగల్ తో ఉన్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ అమ్మడితో మహేష్ బాబు ఫోటోల వెనుక కారణం ఏంటో అంటూ కొందరు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

మహేష్ బాబు లుక్ చూస్తూ ఉంటే కొన్ని రోజుల క్రితం ఫోటోలు ఇవి అయ్యి ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి వీరు ఇద్దరు ఎక్కడ కలిసి ఉంటారు, ఏ సందర్భంలో ఈ ఫోటోలు తీసి ఉంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.

మహేష్ బాబు అంటే బాలీవుడ్‌ లో కూడా చాలా మంది ముద్దుగుమ్మలకు అభిమానం. అలాంటి అభిమానమే నీరూ సెహగల్‌ ది అయ్యి ఉంటుంది. అందుకే నీరు తన అభిమాన హీరో అయిన మహేష్ బాబుతో ఇలా ఫోటో దిగి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే మొన్న సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా కాస్త నిరాశ పరిచింది. అయితే మహేష్ నుంచి రాబోతున్న తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.