Begin typing your search above and press return to search.

కల్కి కోసం మహేష్.. డైరెక్టర్ న్యూ ప్లాన్?

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా జూన్ 27వ తేదీన కల్కి మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 May 2024 6:04 AM GMT
కల్కి కోసం మహేష్.. డైరెక్టర్ న్యూ ప్లాన్?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో విడుదలకు సిద్ధమవుతున్న కల్కి 2898 మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా జూన్ 27వ తేదీన కల్కి మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్.. సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ప్రభాస్ పోస్టర్లు చూసి ఆయన ఫ్యాన్స్ మురిసిపోయారు. హాలీవుడ్ రేంజ్ హీరోలా డార్లింగ్ ఉన్నాడంటూ సంబరపడిపోతున్నారు. సలార్ మూవీతో ఎన్నో రికార్డులు సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో ఇండియన్ బాక్సాఫీసు వద్ద అనేక రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు.

అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో మరో స్టార్ హీరో భాగమవ్వనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కీలక పాత్ర కోసం పని చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాగ్ అశ్విన్ ఆ విషయంపై మహేష్ బాబును సంప్రదించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

కల్కిలో ప్రభాస్ మహా విష్ణువు అవతారంలో కనిపించనున్నారు. దీంతో ప్రభాస్ ను ఆ పాత్రలో పరిచయం చేసేందుకు బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా మహేష్ బాబు ను నాగ్ అశ్విన్ కోరినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పవన్ జల్సా, తారక్ బాద్ షా మూవీలకు వాయిస్ ఓవర్ అందించిన మహేష్.. ఇప్పుడు ప్రభాస్ కల్కి కోసం కూడా తన వాయిస్ ను అందించేందుకు రెడీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక కల్కి మూవీ.. వరల్డ్ వైడ్ గా వివిధ భాషల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కో భాషలో ఒక్కో హీరోను సంప్రదించే ఆలోచనలో ఉన్నారట కల్కి మేకర్స్. అంటే ప్రతి భాషలో ఆ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోతో ప్రభాస్ రోల్ ను పరిచయం చేయడం కోసం వాయిస్ ఓవర్ చెప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి నాగ్ అశ్విన్ రూటే వేరని చెప్పాలి!