Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ జోరు!

స్వీటీ అనుష్క ఇప్ప‌టికే `అరుంధ‌`తి..భాగ‌మ‌తి` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో తానేంటో ప్రూవ్ చేసింది.

By:  Tupaki Desk   |   27 April 2024 7:43 AM GMT
టాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ జోరు!
X

టాలీవుడ్ లో స్ట్రెయిట్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలొచ్చి చాలా కాల‌మ‌వుతోంది. దేశ‌మంతా పాన్ ఇండ‌యా ఫీవ‌ర్ కొన‌సాగ‌డంతో టాలీవుడ్ అదే మ‌త్తులో కొన‌సాగుతుంది. దీంతో కొన్ని ర‌కాల చిత్రాలు తెలుగు ఆడియ‌న్స్ మిస్ అవుతున్నార‌నే విమర్శ కూడా ఉంది. తాజాగా త‌మ‌న్నా..అనుష్క‌..అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్..కాజల్ లాంటి భామ‌లు ఆ అసంతృప్తిని తొల‌గించ‌డానికి రెడీ అయ్యారు. ఈ భామా మ‌ణులంతా సోలోగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డానికి రెడీ అవుతున్నారు.

స్వీటీ అనుష్క ఇప్ప‌టికే `అరుంధ‌`తి..భాగ‌మ‌తి` లాంటి లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో తానేంటో ప్రూవ్ చేసింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ స‌రైన క‌థ సెట్ అవ్వ‌డానిక ఇంత‌కాలం ప‌ట్టింది. ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ ప‌వ‌ర్ ఫుల్ లేడీ ఓరియేంటెడ్ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా సంచ‌ల‌న క‌థాంశంతో ఈసినిమా తె ర‌కెక్కుతుంద‌ని....స్వీటీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుంద‌ని అంచ‌నా లున్నాయి. ఓడిశాలో జ‌రిగిన ఓ దుర్ఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు వినిపిస్తోంది.

ఇక మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా `ఓదెల‌-2` అనే సినిమాతో తొలిసారి మెగా ఫోన్ ప‌ట్టింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో అశోక్ తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో అభిమానులకు బాగా క‌నెక్ట్ అయింది. త‌మ‌న్నా ప‌సుపు విబూదీ రాసిన లుక్ అంతే ఆక‌ట్టుకుంటుంది. ఇదొక భిన్న‌మైన సూప‌ర్ నేచుర‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది నిర్మిస్తున్నాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌వీణ్ కాట్రేగుల ద‌ర్శ‌క‌త్వంలో `ప‌ర‌దా` అనే చిత్రం తెర‌కెక్కుతోంది.

`ఇన్ ది నేమ్ ఆఫ్ ల‌వ్` అనేది ఉప‌శీర్షిక‌. ఇప్ప‌టికే రిలీజ్ అయిన కాన్సెప్ట్ వీడియో ఆక‌ట్టుకుంటుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి ప్ర‌య‌త్నాలు అనుప‌మ చేసింది లేదు. స‌క్సెస్ అయితే అమ్మ‌డి కెరీర్ కి తిరుగుండ‌దు. ఇప్ప‌టికే యువ‌త‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన న‌టిగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో సుమన్ చిక్కాల చిక్కాల రూపొందిస్తున్నాడు. ఈ భామ‌లంతా ఇదే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.